యూరిన్ ఇన్ఫెక్షన్. తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించే యూరినరీ సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ కొందరు తరచూ ఈ సమస్యకు గురవుతుంటారు.యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి, మూత్రం రంగు మారడం, మూత్రం చెడు వాసన రావడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు మదన పెడుతూ ఉంటాయి.
అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించుకోవడం కోసం యాంటీ బయాటిక్స్ ను యూస్ చేస్తుంటారు.
అయితే యాంటీ బయోటిక్స్ తాత్కాలికంగానే కానీ, శాశ్వత పరిష్కారాన్ని అందించలేవు.
అందుకే యూరిన్ ఇన్‌ఫెక్షన్ తగ్గేందుకు చికిత్స పొందుతున్నప్పటికీ.మళ్లీ మళ్లీ సంభవించకుండా నిరోధించడానికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
శరీరంలో నీటి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడే ఇటువంటి యూరినరీ సమస్యలు ఎదురవుతాయి.అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన వారు వాటర్ తో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి వాటిని సేవించాలి.
అదే సమయంలో కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

అల్లం కషాయం.యూరిన్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా కూడా అడ్డుకుంటుంది.కాబట్టి, వారంలో మూడంటే మూడు సార్లు అల్లం కషాయంను తీసుకునేందుకు ప్రయత్నించాలి.
అలాగే మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకున్నా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.అందుకే మూత్రాన్ని గంటలు తరబడి ఆపుకోవడం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఆవిరిపై ఉడికించిన వెల్లుల్లి రెబ్బలను రోజుకు రెండు, మూడు తింటూ ఉండాలి.తద్వారా అందులో పుష్కలంగా ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా నిరోధిస్తాయి.
ఇక లైంగిక సంపర్కం అనంతరం తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి.మరియు ఆ భాగాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.తద్వారా ఇన్ఫెక్షన్స్ ఏర్పడకుండా ఉంటాయి.