అవినీతి ఆరోపణలు.. భారత సంతతి మంత్రి ఈశ్వరన్‌ను ప్రశ్నించిన దర్యాప్తు ఏజెన్సీ, 10 గంటల పాటు విచారణ

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్‌ను( Minister S Eswaran ) కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) విచారిస్తోన్న సంగతి తెలిసిందే.మంగళవారం దాదాపు పది గంటల పాటు ఆయనను విచారించినట్లుగా సింగపూర్ మీడియా కథనాలను ప్రసారం చేశాయి.మంగళవారం ఉదయం 10.50 గంటలకు రెడ్‌హిల్ ఎస్టేట్‌లోని లెంగ్‌క్రాక్ బహ్రూ ( Langcrack Bahru in Redhill Estate )వద్ద వున్న సీపీఐబీ భవనానికి ఆయన వచ్చారు.నీలిరంగు చొక్కా, ముదురు రంగు ప్యాంట్ ధరించిన ఈశ్వరన్ ఒంటరిగానే సీపీఐబీ కార్యాలయంలోకి వచ్చారు.

 Indian-origin Minister S Iswaran In Singapore Questioned By Cpib , Cpib , Minist-TeluguStop.com
Telugu Cpib, Indonesia, Langcrackbahru, Eswaran, Peoples, Singapore, Yetamarina-

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరన్, హోటల్ ప్రాపర్టీ లిమిటెడ్ ఎండీ ఓంగ్ బెంగ్ సెంగ్‌లను జూలై 11న అరెస్ట్ చేసినట్లు సీపీఐబీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.దర్యాప్తు తీరుపై ఏజెన్సీ తదుపరి వివరాలను మాత్రం వెల్లడించలేదు.అరెస్ట్ తర్వాత ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేయగా.షరతులలో భాగంగా వారి పాస్‌పోర్ట్‌లను బ్యూరో స్వాధీనం చేసుకుంది.77 ఏళ్ల ఓంగ్ .విదేశాలకు వెళ్లేందుకు సీపీఐబీ అనుమతి లభించిన తర్వాత.సోమవారం మధ్యాహ్నం ప్రైవేట్ విమానంలో బాలి నుంచి సింగపూర్‌కు తిరిగి వచ్చారు.

అనంతరం 1,00,000 సింగపూర్ డాలర్ల పూచీకత్తుపై బెయిల్ లభించిన తర్వాత ఓంగ్ గత శుక్రవారం ఇండోనేషియాకు వెళ్లారు.

Telugu Cpib, Indonesia, Langcrackbahru, Eswaran, Peoples, Singapore, Yetamarina-

సింగపూర్‌ను ఫార్మూలా వన్ సర్క్యూట్‌లో భాగమయ్యేలా చేయడంలో ఈశ్వరన్, ఓంగ్ కీలక పాత్ర పోషించారు.ఓంగ్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఇది ప్రతి యేటా మెరీనా బే స్ట్రీట్ సర్క్యూట్‌లో( Yeta Marina Bay Street Circuit ) ఎఫ్ 1 నైట్ రేసును నిర్వహిస్తున్నారు.2000లో ఈశ్వరన్ (ఆ సమయంలో జూనియర్ వాణిజ్య మంత్రి), ఓంగ్‌లు కలిసి అప్పటి ఫార్ములా వన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎక్లెస్టోన్‌ను సింగపూర్‌‌లో 2008లో ప్రారంభమయ్యే రేస్‌కు వేదికగా చేసేందుకు ఒప్పించారు.కాగా.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.

అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్‌ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube