గాంధీ విగ్రహం ధ్వంసం, పెరుగుతోన్న విద్వేషం : యూఎస్‌లో ప్రవాస భారతీయుల నిరసన

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.

 Indian Community Protest Against Hate Crimes, Vandalism Of Gandhi Statue In Usa-TeluguStop.com

ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేషదాడి జరిగింది.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .బాధితుడు, నిందితుడు ఇద్దరూ భారతీయులే కావడం.అయితే అమెరికన్లు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్నారు.భౌతికదాడులతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు.పోలండ్ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ భారతీయుడిపై విద్వేషం వెళ్లగక్కాడు.తర్వాత ఏకంగా ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది.

గత గురువారం ఐదు ఆడియో సందేశాలు తన మొబైల్‌కి వచ్చాయని.ఇందులో అశ్లీల కంటెంట్ కూడా వున్నట్లు ప్రమీలా జయపాల్ తెలిపారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేషదాడులు, గాంధీ విగ్రహం ధ్వంసం తదితర ఘటనలకు వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద భారతీయులు శాంతియుతంగా నిరసన తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ (ఎఫ్ఐఏ)తో పాటు ఇతర కమ్యూనిటీ సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.

బైడెన్ పరిపాలనా యంత్రాంగం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.క్షతగాత్రులందరినీ సురక్షితంగా వుంచేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు నిరసనకారులు.

Telugu Calinia, Consulgeneral, Gandhi Statue, York, Randhir Jaiswal, Time Square

ఇకపోతే.న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ ప్రసంగిస్తూ ద్వేషపూరిత నేరాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అప్రమత్తంగా వుండాలని సూచించారు.జాతిపిత మహాత్మా గాంధీ బోధించే శాంతితో నిండిన సామరస్యాన్ని , అహింసను అలవరచుకోవాలని జైస్వాల్ పిలుపునిచ్చారు.ఇదే సమయంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు జరిపిన 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube