మునుగోడు ఎన్నికలు : ఆ అసంతృప్తులపైనే కేసీఆర్ ఆశలు ?

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోయినా,  పార్టీని తనను చూసి ఓటు వేసేవారు ఎక్కువమంది ఉంటారని అంచనాలో కేసీఆర్ ఉన్నారు.

 Cm Kcr Targets Dissatisfied Leaders Of Congress And Bjp Before Munugode By Polls-TeluguStop.com

దీనికి తోడు ఇతర పార్టీలోని అసంతృప్తి నాయకులు తమకు కలిసి వస్తారని నమ్మకం పెట్టుకున్నారు.ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నాయకులకు మండలాలు గ్రామాల వారీగా ఇన్చార్జిలుగా బాధ్యతలను అప్పగించారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.అభ్యర్థి ఎంపిక పైన పూర్తిస్థాయిలో కేసీఆర్ కశరత్తుచేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే .తమ బలంతో పాటు శత్రువులను ఏవిధంగా బలహీనం చేయాలనే విషయం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

దీనిలో భాగంగానే కాంగ్రెస్ బిజెపిలోని అసంతృప్త నాయకులను గుర్తించే పనుల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారు.ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ నుంచి బిజెపిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిన సమయంలో.

  ఆయన వెంట వెళ్లకుండా ఆయనతో విభేదించిన నాయకులు ఎవరు ?  ఎందుకు విభేదించారు వంటి అన్ని విషయాల పైన కెసిఆర్ నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు.ఇక కాంగ్రెస్ లోను పార్టీ టికెట్ ఆశించి బంగపడిన నాయకులు అసంతృప్తితో ఉండడంతో వారి వ్యవహారం ఏ విధంగా ఉంది ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థికి దెబ్బ కొడతారా ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు.

Telugu Komatirajagopal, Komati Venkata, Telangana-Political

కాంగ్రెస్ నుంచి మునుగోడు అసెంబ్లీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆమెను వ్యతిరేకించే వారి వివరాలను ఆరో తీస్తున్నట్లు సమాచారం.వీరులో కీలకమైన కొంతమందిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ బలం పెంచుకుని తమ రాజకీయ ప్రత్యర్థులను బలహీనం చేయవచ్చని లెక్కలు వేస్తున్నారు.అలాగే ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపించగల కుల సంఘాలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోవడంతో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేస్తూ ఫలితం తమకు అనుకూలంగా ఉండే విధంగా కేసిఆర్ వ్యూహాలు రక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube