భారతీయ అమెరికన్ బాలిక, ఆవిష్కర్త గీతాంజలి రావు( Indian Origin Gitanjali Rao )ను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సత్కరించారు.ఆమెతో పాటు మరో 14 మందిని కూడా ఫస్ట్ లేడీ సన్మానించారు.
దేశవ్యాప్తంగా తమ కమ్యూనిటీలలో మార్పుకు నాయకత్వం వహించి, ఉజ్వల భవిష్యత్తును రూపొందించినందుకు సత్కరించారు.అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో జరిగిన తొలి ‘‘గర్ల్స్ లీడింగ్ చేంజ్’’( Girls Leading Challenge ) వేడుకలో 17 ఏళ్ల గీతాంజలి రావు సన్మానం అందుకున్నారు.
వైట్‌హౌస్ జెండర్ పాలసీ కౌన్సిల్ ఈ 15 మంది యువ మహిళా నాయకులను గుర్తించి ఈ సత్కరించింది.

ఈ అసాధారణమైన గర్ల్స్ లీడింగ్ ఛేంజ్ గ్రూపును వైట్‌హౌస్( White House )లో కలుసుకోవడం తనకు దక్కిన గౌరవమని జిల్ బైడెన్ ట్వీట్ చేశారు.ఈ యువతులు భూమిని కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారని ఆమె ప్రశంసించారు.మనస్సును మార్చే కథలను వ్రాసి, మనతో పంచుకుంటున్నారని జిల్ బైడెన్( Jill Biden ) తెలిపారు.
వారి ఆవిష్కరణ, బలం, ఆశ, శక్తి నుంచి ఇతరులు ప్రేరణ పొందుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కొలరాడోలోని హైలాండ్స్ రాంచ్‌కు చెందిన గీతాంజలి రావు.
ఒక శాస్త్రవేత్త.సీసం కాలుష్యాన్ని గుర్తించే సాధనాన్ని కనుగొన్నందుకు గాను ఆమెకు ఈపీఏ ప్రెసిడెన్షియల్ అవార్డు, డిస్కవరీ ఎడ్యుకేషన్ నుంచి అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ అవార్డును గెలుచుకుంది.
గీతాంజలి రావు రచించిన ‘‘యంగ్ ఇన్నోవేటర్స్ గైడ్ టు STEM ’’( Young Innovator’s Guide to STEM )పుస్తకం ఐదు దశల ఆవిష్కరణ ప్రక్రియను అందిస్తుంది.దీనిని ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో STEM పాఠ్యాంశంగా ఉపయోగిస్తున్నారు.

2020లో టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటి ‘‘కిడ్ ఆఫ్ ది ఇయర్’’గా( Kid of The Year ) గుర్తింపు తెచ్చుకున్న గీతాంజలి రావు శాస్త్రవేత్తగా , ఆవిష్కర్తగా తన వృత్తిని కొనసాగించడమే కాకుండా 80 వేలకు పైగా ప్రాథమిక , మధ్య, ఉన్నత పాఠశాలలకు తన STEM ను విస్తరించడానికి కట్టుబడి వున్నారు.