గ్రీన్‌కార్డులు, హెచ్-1బీ వీసా సంస్కరణలు.. జో బైడెన్ తీరుపై భారత సంతతి నేత అసహనం

అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందేందుకు వేలాది మంది భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అయితే కంట్రీ క్యాప్ నిబంధన కారణంగా భారత్ , చైనా వంటి పెద్ద దేశాలకు చెందిన వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Indian American Representative Ro Khanna Disappointed With Biden's Stand On Gree-TeluguStop.com

ఇలా నిరీక్షిస్తూ పోతే 200 ఏళ్లు గడిచినా భారతీయులకు గ్రీన్ కార్డ్ రావడం కష్టమే.ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ క్యాపిటల్‌లో జరిగిన టెక్ ఇమ్మిగ్రేషన్ సమ్మిట్‌లో గ్రీన్‌కార్డులు, హెచ్ 1 బీ వీసాలపై భారతీయ టెక్ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేశారు.

Telugu Eagle, Green Cards, Visa, Rems, Indian, Joe Biden, John Curtis, Ro Khanna

మూడేళ్ల క్రితమే కొందరు అమెరికా చట్టసభ్యులు కూడా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌కు సంబంధించి వివిధ దేశాలపై వున్న పరిమితి (కంట్రీ క్యాప్)ని తొలగించాలని యుఎస్ ప్రతినిధుల సభలో బిల్లుని ప్రవేశపెట్టారు.కాంగ్రెస్ మహిళ జో లోఫ్గ్రెన్, కాంగ్రెస్ సభ్యుడు జాన్ కర్టిస్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయ ఐటి నిపుణులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.ఉపాధి ఆధారిత వలస వీసాలపై దేశానికి ఏడు శాతంగా వున్న పరిమితిని దశలవారీగా ఎత్తివేయాలని ఈ బిల్లులో ప్రస్తావించారు.

అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలపై ఇప్పటి వరకు వున్న ఏడు శాతం పరిమితిని 15 శాతానికి పెంచాలని సూచించింది.

Telugu Eagle, Green Cards, Visa, Rems, Indian, Joe Biden, John Curtis, Ro Khanna

కానీ లీగల్ ఎంప్లాయ్‌మెంట్ (ఈగల్) చట్టం, 2021 విషయంలో ఎలాంటి ముందడుగు పడటం లేదంటూ భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా (ఎఫ్ఐఐడీఎస్) నిర్వహించిన ఈ సమ్మిట్. గ్రీన్‌కార్డు జారీపై ఏడు శాతం కంట్రీ కోటా చూపే ప్రభావాన్ని నొక్కి చెప్పింది.

దీని ఫలితంగా చాలా మంది భారతీయ వలసదారులు శాశ్వత నివాస హోదా కోసం 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వస్తోందని రో ఖన్నా అన్నారు.గ్రీన్ కార్డ్ క్యాప్‌లను ఎత్తివేయడం వల్ల కలిగే ఆర్ధిక ప్రయోజనాలను ఆయన వివరించారు.

ఈగల్ యాక్ట్‌( EAGLE Act )కు రూల్స్ కమిటీ దాదాపు 350 సవరణలు ప్రతిపాదించింది.దానిని నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్‌లో చేర్చకుండా రిపబ్లికన్ సూపర్ మెజారిటీ నిరోధించిందని రో ఖన్నా పేర్కొన్నారు.

విదేశీ ఔట్‌సోర్సింగ్ కంపెనీల హెచ్ 1 బీ( H-1B B visa) దుర్వినియోగానికి ముగింపు పలకాలని ఆయన సూచించారు.ఇది వేతనాలను తగ్గించడమే కాకుండా కార్మికులకు హాని చేస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube