రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ముఖ్యంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈమె తరచూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
ఇక తన కొడుకు తన తండ్రి వెంటే తిరుగుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ షేర్ చేస్తూ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పోస్ట్ పై చేసే కామెంట్ల పట్ల రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా కొంతమంది ఈమెకు ఇచ్చే సలహాలు అసలు సహించరు.ఇప్పటికే ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికైనా మీరు అన్నయ్య దగ్గరకు వచ్చేయండి వదినమ్మ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.ఈ సలహాల పై ఈమె స్పందించారు.
ఈ సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం ఎడిట్ చేసి పెట్టిన ఒక వీడియోని షేర్ చేయడం మర్చిపోయాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియో షేర్ చేసిన ఈమె నాకు నా మాజీ భర్త దగ్గరికి తిరిగి రావాలని ఉందని, ఆయనని ఏవిధంగా కలుసుకోవాలి అనే విషయాల గురించి ఉచిత సలహాలు ఇస్తున్నారు.ఇలాంటి సలహాలు ఇవ్వడం ఇప్పటికైనా మానుకోండి .ఇకపై ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తే నేను వారిని తప్పకుండా బ్లాక్ చేసేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల( Pawan Kalyan Fans ) పట్ల ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే పవన్ కళ్యాణ్ కు దూరమయ్యారని పలు సందర్భాలలో వెల్లడించారు.ఇక పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉన్నా పవన్ అభిమానులు మాత్రం తనను ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.