ప్రెగ్నెన్సీ సమయంలో ఆ తప్పు చేయొద్దంటూ దీపికకు నెటిజన్ల సలహాలు.. ఏమైందంటే?

దీపికా పదుకొనే( Deepika Padukone ) ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది.దీపిక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో కూడా ఈమె బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Trolls On Deepika Padukone High Heels Details, Deepika Padukone, Deepika Padukon-TeluguStop.com

సినిమాలో గర్భంతో ఉన్న మహిళ పాత్రలో కనిపించిన దీపికా పదుకొనే రియల్ లైఫ్ లో కూడా గర్భవతిగా ఉన్నారనే సంగతి తెలిసిందే.దీపిక బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

గర్భంతో ఉన్న దీపిక హై హీల్స్( High Heels ) ధరించడం విషయంలో నెటిజన్ల విషయంలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హై హీల్స్ ధరించడం వల్ల ఏ మాత్రం పట్టు తప్పినా కాలుజారి కింద పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం దీపికా పదుకొనే ఫ్యాషన్స్ కంటే కంఫర్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దీపికా పదుకొనే కల్కి సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.కల్కి 2898 ఏడీ సినిమాలో మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ప్రభాస్ ( Prabhas ) ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది.

నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాతో రాజమౌళి రేంజ్ డైరెక్టర్ అవుతారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి 2898 ఏడీ ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించి భారీ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube