భారత రక్షణ అమ్ములపొదిలో రాఫెల్ యుద్ద విమానాలు వచ్చి చేరాయి.ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ ఆర్డర్ ఇచ్చిన 36 రాఫెల్ విమానాల్లో ఐదు ఇటీవల దేశానికి చేరిన విషయం తెలిసిందే.
కొన్ని రోజులుగా హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఉన్న ఈ విమానాలు ఈ రోజు భారత వైమానిక దళంలో చేరినట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా సర్వధర్మ పూజ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ కూడా హాజరయ్యారు.
సర్వధర్మ పూజ తర్వాత ఎయిర్‌షో నిర్వహించగా తొలుత రాఫేల్ విమానం చుట్టూ సుఖోయ్-30, జాగ్వార్ విమానాలు గాలిలో ఎగురుతూ వందనం చేశాయి, తేజస్ యుద్ధ విమానాలు కూడా ఈ ఎయిర్ ఫో లో పాల్గొనగా అత్యద్భుతంగా ఎయిర్‌షో నిర్వహించారు.గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో చేరిన రాఫేల్స్‌కు వాటర్ కెనాన్ సెల్యూట్ కూడా నిర్వహించారు.దీంతో భారత వాయుసేనలో కొత్త అధ్యాయం మొదలైంది.
36 రాఫెల్స్ కోసం 59వేల కోట్ల ఒప్పందం జరుగగా, తొలుత 5 రాఫేల్స్ రాగా,వచ్చే నెలలో మరో నాలుగు రాఫెల్ విమానాలు ఇండియాకు రానున్నట్లు సమాచారం.ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భారత వాయుదళ శక్తిని మరింత పెంచనున్నాయి.ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగలవు.