ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం విషయంలో అనేక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.ముందుగా గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మద్యం ధరల అమ్మకాలను అమాంతం పెంచేసింది.
అదే రీతిలో బార్ షాప్ లు వద్ద సిట్టింగ్ విధానం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.మద్యం అమ్మకాల సమయం కూడా తగ్గిస్తూ వచ్చింది.
ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయాలని ప్రభుత్వం చూస్తుంటే కొన్ని జిల్లాల ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ తీసుకువచ్చి అక్రమంగా మద్యం అమ్మేస్తున్నారు.
ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అక్రమ మద్యం బాగా యథేచ్ఛగా జరుగుతోంది.
ముఖ్యంగా బ్రాండెడ్ కలెక్టర్ దొరకకపోవటం అక్రమార్కుల వ్యాపారానికి వరంగా మారింది.మద్యం అక్రమ వ్యాపారం పై దాడులు చేస్తున్న.
ఏపీ మద్యం అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది.ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని తీసుకొచ్చి జోరుగా అమ్మేస్తున్నారు.
పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ ఏరులై పారుతున్న పరిస్థితి.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్థానికంగా ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు భారీగా అక్రమ మద్యాన్ని తక్కువ ధరకు మందుబాబులకు అమ్ముతున్నారు.