వన్ డే అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్ 490/4 గా నమోదు చేసి చరిత్ర సృష్టించింది.సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్ లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు.
కానీ, పురుష క్రికెటర్లకు సైతం సాధ్యం కాని ఈ అద్భుతమైన రికార్డును కివీస్ మహిళల జట్టు ఆవిష్కరించింది.ఇప్పటివరకు పురుషుల క్రికెట్ లో ఆస్ట్రేలియాపై 2018 లో 481/6 స్కోర్ నమోదు చేశారు.
మెన్స్ క్రికెట్ లో ఇదే అత్యుత్తమ స్కోర్‌గా కొనసాగుతుండటం విశేషం.తాజాగా జరిగిన న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ వేదికగా జరిగిన వన్డే పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది.
,/br>
కివీస్ జట్టులో ఓపెనర్ సుజీ బేట్స్ 94 బంతుల్లో 151 పరుగులు ( 24 ఫోర్లు, 2 సిక్సర్లు) కొట్టింది.వన్ డౌన్ ప్లేయర్ మ్యాడీ గ్రీన్ 77 బంతుల్లో 121 పరుగులు ( 15 ఫోర్లు, సిక్స్) కొట్టింది.
అద్భుత శతకాలతో చెలరేగగా ఆఖర్లో అమేలియా కెర్ 45 బంతుల్లో 81 పరుగులు ( 9 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది వీరవిహారం చేసింది.మరో ఓపెనర్ జెస్ వాట్కిన్ 59 బంతుల్లో 62 పరుగులు (10 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది.
దీంతో న్యూజిలాండ్ జట్టు వన్డేల్లో చారిత్రక స్కోర్ నమోదు చేసింది.

అనంతరం 491 పరుగుల అతి భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో ఆతిధ్య ఐర్లాండ్ జట్టు 35.3 ఓవర్లలలో 144 పరుగలకే చాపచుట్టేసింది.ఐర్లాండ్ జట్టులో కెప్టెన్ లారా డెలానీ అత్యధికంగా 37 పరుగులు చేసింది.
దీంతో న్యూజిలాండ్ 347 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.ప్రస్తుతం ఇదే అత్యధిక స్కోరుగా రికార్డు కెక్కింది.