ఇటుకలో బిర్యానీ తినాలంటే అక్కడికి వెళ్లాల్సిందే!

ఎంత బిర్యానీ ఫేమస్ అయితే మాత్రం ఆఖరికి ఇటుకతో పెట్టి ఇస్తారా? అని ఆలోచించవద్దు.కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది బిర్యానీకి అనర్హం అన్న మాదిరి తయారయింది పరిస్థితి.

 If You Want To Eat Biryani In Brick, You Have To Go There, Viral News, Latest Ne-TeluguStop.com

బేసిగ్గా చికెన్ బిర్యానీ అనగానే అందరి నోరు ఊరుతుంది.నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే ఆహార పదార్ధాలలో బిర్యానీ ముందు ప్లేసులో ఉంటుంది.

ఇక హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫేమస్ అనుకోవాలి.

కొత్తవారు ఒక్కసారి దీనిని రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు.అకేషన్ ఏదైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఫ్రెండ్స్‎తో చిల్ అవ్వాలన్నా బిర్యానీ ఉడకాల్సిందే.

Telugu Biryani, Brick Biryani, Latest-Latest News - Telugu

ఈ క్రమంలోనే బిర్యానీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఒక్కో రెస్టారెంట్ బిర్యానీలో ఒక్కో ప్రయోగం చేసుకుంటూ పోతోంది.ఇప్పటి వరకు దమ్‌ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ, కుండ బిర్యానీ, బకెట్ బిర్యానీ పేర్లను మీరు విన్నారు.ఇప్పుడు లేటెస్టుగా బ్రిక్‌ బిర్యానీ అందుబాటులోకి వచ్చిందండి.ఇటుక బిర్యానీ అంటే ఇటుక పొయ్యి మీద చేసే బిర్యానీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఇటుకలో బిర్యానీ చేస్తారు.అదే ఈ డిష్ స్పెషాలిటీ మరి.ఇటుకతో తయారు చేసిన ఓ రెక్టాంగిల్ పాత్ర తీసుకుని అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన అన్ని ఇంగ్రేడియంట్స్‎ను వేసి మూత పెట్టి ఉడికిస్తే.ఘుమఘుమలాడే బ్రిక్‌ బిర్యానీ రెడీ.

Telugu Biryani, Brick Biryani, Latest-Latest News - Telugu

ఇక ఇలాంటి బిర్యానీ ఎక్కడ లభిస్తుందని అని తెగ వెతికేయొద్దు మరి.ఎందుకంటే ఇది మనదగ్గరే హైదరాబాద్‌, కొంపల్లిలో ఈ బ్రిక్ బిర్యానీ మీకు దొరుకుతుంది.దీని కాస్ట్ కూడా మిగతా బిర్యానీలతో పోల్చితే తక్కువే.కేవలం రూ.189 కే బిర్యానీ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది అక్కడ.వింటేనే నోరూరుతోంది కదూ.నిజానికి ఈ ఇటుక బిర్యానీ భోజన ప్రియులను తెగ నచ్చేస్తోందట.అందుకే ఈ బిర్యానికోసం జనాలు తెల్లారుఘామునుండి క్యూలు కడతారట.

మీరు కూడా ఓమారు ట్రై చేయండి మరి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube