ఓట్లు చీలితే.. రిజల్ట్ రివర్స్ !

ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణవైపే మళ్ళింది.ఈసారి తెలంగాణలో అధికారం ఎవరిది ? ప్రజలు ఎవరి పక్షాన నిలువబోతున్నారు ? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? ఇలా ఎక్కడ చూసిన వీటిపైనే చర్చ.అయితే ఈసారి ఎలక్షన్స్ కూడా గతంలో కంటే ఆసక్తికరంగా మారాయి.ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ( Congress , BJP ) పార్టీలు కూడా అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

 If The Votes Are Split, The Results Will Be Reversed , Brs Party , Bjp, Beeram H-TeluguStop.com

ఈ పార్టీలకు తోడు స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టిగానే పోటీ పడుతున్నారు.దీంతో తెలంగాణ ఓటర్ల అభిప్రాయాన్ని అంచనా వేయడం విశ్లేషకులకు సైతం కష్టంగా మారింది.

Telugu Brs, Congress, Jupallykrishna, Ts-Politics

ఈ నేపథ్యంలో ఓట్ల చీలిక ఎలాంటి ప్రభావం చూపబోతుందనేది ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో గత తొమ్మిదేళ్ల కాలంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బి‌ఆర్‌ఎస్( BRS ) పార్టీపై సానుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో మూటగట్టుకుంది.అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పుంజుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట.అయితే ప్రభుత్వ వ్యతిరేక పోటు ఏ పార్టీ వైపు వెళుతుందనేదే అసలు ప్రశ్న.ఇకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై కూడా ప్రజల్లో విశ్వసనీయత లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కీ రోల్ పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Telugu Brs, Congress, Jupallykrishna, Ts-Politics

అటు ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గాని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వ్యతిరేక ఓటు గాని స్వతంత్ర అభ్యర్థుల వైపు మళ్ళీతే చాలా నియోజక వర్గాల్లో ఫలితాలపై ప్రభావం ఉంటుంది.ఉదాహరణకు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తరుపున జూపల్లి కృష్ణరావు( Jupally Krishna Rao ), బి‌ఆర్‌ఎస్ తరుపున బీరం హర్షవర్ధన్ రావు, బీజేపీ తరుపున సుధాకర్ రావు బరిలో ఉన్నారు వీరికి తోడు స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క కూడా పోటీ చేస్తున్నారు.నియోజక వర్గంలో ప్రస్తుతం బర్రెలక్కకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.తద్వారా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు ను బర్రెలక్క చీల్చే అవకాశం లేకపోలేదు.ఇలా చాలా నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం గట్టిగానే ఉండనుంది.వీరి కారణంగా ప్రధాన పార్టీల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube