చామంతి పూల సాగులో ఆకుమచ్చ తెగులు, తామర పురుగులను నివారించే చర్యలు..!

తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పూలలో చామంతి పూల పంట( Chamanti flower crop ) కూడా ఒకటి.శుభ, అశుభ అన్నీ కార్యక్రమాలలో చామంతి పూలను ఉపయోగిస్తారు.

 Measures To Prevent Leaf Spot Rot And Lotus Insects In Chamanti Flower Cultivati-TeluguStop.com

కాబట్టి చామంతి పూలకు మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ.చామంతి అనేది ఒక శీతాకాలపు పంట.ఆరుబయట ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సాగు చేస్తారు.పూల కోతల తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలలో చామంతి మొక్కల కొమ్మలు కత్తిరించి ప్రవర్దనం చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పూల నాణ్యత బాగుంటుంది.

చామంతి పూల సాగుకు ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.తేమ తక్కువగా ఉండే నల్ల రేగడి నేలలు కూడా అనుకూలంగానే ఉంటాయి.నేలలో తేమ అధికంగా ఉంటే చామంతి మొక్కలకు వేరుకుళ్ళు సోకే అవకాశం ఉంటుంది.

Telugu Agriculture, Chamanti Flower, Yieldchamanti-Latest News - Telugu

జూన్ నుండి ఆగస్టు వరకు చామంతి పంటను నాటుకోవచ్చు.అయితే పండగల సీజన్లు దృష్టిలో పెట్టుకొని 15 నుంచి 20 రోజులు రెండు లేదా మూడు దఫాలుగా మొక్కలు నాటితే పూలను ఎక్కువ కాలం పొందే అవకాశం ఉంటుంది.ఈ పంటకు ఆకు మచ్చ తెగుళ్లు, ( pests )తామర పురుగుల బెడద చాలా ఎక్కువ.

సకాలంలో వీటిని గుర్తించి తొలిదశలో అరికడితే అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.

Telugu Agriculture, Chamanti Flower, Yieldchamanti-Latest News - Telugu

చామంతి పూల మొక్కల ఆకులపై వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణంతో మధ్య భాగం తెల్లగా ఉంటుంది.మొక్కలపై ఈ లక్షణాలు గుర్తిస్తే.ఆ మొక్కకు ఆకు మచ్చ తెగులు సోకినట్టే.

వెంటనే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ను కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.చామంతి పూల మొక్కలను( Chamanti flower Cultivation ) తామర పురుగులు ఆశిస్తే. దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.పూల నాణ్యత కూడా చాలావరకు తగ్గుతుంది.

ఈ పురుగులు పొలంలో కనిపిస్తే.ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ ను కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube