ఐపీఎల్ సీజన్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.ఈ నెల 21న గుజరాత్- బెంగుళూరు( GT vs RCB ) మధ్య జరిగే మ్యాచ్ తో లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి.
బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఈ నెల 21న బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో గుజరాత్ జట్టుపై కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
ముంబై జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఈ నెల 21న ముంబైలోని వాఖండే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.ఈ మ్యాచ్ లో గెలిచిన కూడా ముంబై జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుందనే గ్యారెంటీ మాత్రం లేదు.
తాజాగా జరిగిన కీలక మ్యాచ్లో లక్నో చేతులో ఐదు పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే ముంబై జట్టుకు ప్లే ఆఫ్ కు చేరే అవకాశం కాస్త ఎక్కువగా ఉండేది.కాబట్టి హైదరాబాద్ – ముంబై( SRH vs MI ) మధ్య జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు కీలకం.
ముంబై జట్టు గెలిచినా కూడా ఇతర జట్ల నెట్ రన్ రేట్ మీదనే ముంబై జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఇక బెంగుళూరు – హైదరాబాద్ మధ్య కూడా ఓ మ్యాచ్ జరగాల్సి ఉంది.ఇందులో బెంగుళూరు జట్టు కచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరాల్సిందే.ఒకవేళ ఓడితే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్టే.
అంటే ముంబై, బెంగుళూరు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్తాయా, లేదా అనేది హైదరాబాద్ చేతులో ఉంది.హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేసు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.
కాబట్టి హైదరాబాద్ జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్లలో ఓడిన, గెలిచినా ఉపయోగం ఏమీ లేదు.కానీ రెండు మ్యాచ్లలో గెలిస్తే మాత్రం ఆ రెండు జట్ల ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం.