దొంగ పట్టాలని నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా..: బాలినేని

ఏపీలోని ప్రతిపక్ష పార్టీలపై మాజీ మంత్రి బాలినేని తీవ్రంగా మండిపడ్డారు.ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో కావాలనే విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.

 If He Proves To Be A Thief, He Will Leave The Election Ring..: Balineni-TeluguStop.com

అర్హుల ఎంపికలో పార్టీలను చూడలేదన్న ఆయన ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారని తెలిపారు.

పట్టాలు ఇవ్వకముందు ఇవ్వలేదన్న ప్రతిపక్షాలు ఇచ్చిన తరువాత దొంగ పట్టాలని ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాము అందించిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలని నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.

అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తామన్న ఆయన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube