Sreeleela Allu Arjun : శ్రీలీలకు కాల్ చేసి మరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్… ఏం జరిగిందంటే?

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ టక్కున శ్రీ లీల( Sreeleela ) పేరే చెబుతారు ఇలా యంగ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.నటిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు సినిమాలకు కమిట్ అయి ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో శ్రీలీలకు కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్( Fans Following ) పెరిగిపోయింది.

 Iconstar Allu Arjun Sweet Warning To Sreeleela-TeluguStop.com

ఏ దర్శకుడు అయిన లేదా నిర్మాత అయిన కొత్త సినిమా ప్రారంభించాలి అంటే హీరోయిన్గా అందరి చూపు శ్రీ లీల పైనే ఉంది.ఇలా తనకు వరుస అవకాశాలు రావడంతో తనకు కాల్ షీట్స్ లేక ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను కూడా శ్రీ లీల రిజెక్ట్ చేస్తున్నారు.


Telugu Allu Arjun, Sreeleela, Sreeleelaallu, Tollywood-Movie

ఇలా ఎంతో మంచి సినిమా అవకాశాలను కూడా ఈమె కోల్పోవడంతో ఒకవైపు బాధపడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది.అయితే ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఫోన్ చేసి మరి తనకు వార్నింగ్ ఇచ్చారట.మరి అల్లు అర్జున్ శ్రీలీల కు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.


Telugu Allu Arjun, Sreeleela, Sreeleelaallu, Tollywood-Movie

ఈ విధంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో( Allu Arjun Trivikram Combo ) రాబోతున్నటువంటి ఈ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ లీల పేరును సజెస్ట్ చేశారట.ఇక అల్లు అర్జున్ సైతం ఈమె హీరోయిన్గా అయితే తనకు ఓకే అని చెప్పగా దర్శక నిర్మాతలు శ్రీలీలను సంప్రదించడంతో శ్రీ లీల చాలా సున్నితంగా ఈ సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేశారట.ప్రస్తుతం తనకు ఏమాత్రం కాల్ షీట్స్ లేకపోవడంతోనే ఈ సినిమా కథ నచ్చినప్పటికీ వదులుకోవాల్సి వస్తుందని చెబుతూ శ్రీ లీల ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారట.ఈ విషయం అల్లు అర్జున్ కి తెలియడంతో ఆయన ఫోన్ చేసి మరి ఈమెకు తన స్టైల్ లో స్ట్రాంగ్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.


Telugu Allu Arjun, Sreeleela, Sreeleelaallu, Tollywood-Movie

ఈ సినిమా విషయంలో శ్రీలీలకు ఫోన్ చేసినటువంటి అల్లు అర్జున్ నా సినిమాని కూడా మీరు రిజెక్ట్ చేస్తారా అంటూ ఆమెకు స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మంచి సినిమా అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తాయి అలాంటి సినిమా అవకాశాలను వదులుకున్నప్పుడు మరి అలాంటి అవకాశం రావాలన్నా కూడా రాదు అంటూ పరోక్షంగా తనకి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ విధంగా అల్లు అర్జున్ తనకు ఫోన్ చేసి మరి ఈ విషయం గురించి మాట్లాడటంతో శ్రీలీలా మరోసారి ఈ సినిమా విషయంలో ఆలోచన చేసి ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.ఈ సినిమాకు శ్రీ లీల గ్రీన్ సిగ్నల్( Sreeleela Allu Arjun Movie ) ఇచ్చారనే వార్త తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బన్నీకి ఎప్పుడు ఏం కావాలో బాగా తెలుసు దానిని సాధించడం కోసం ఎంతవరకైనా ప్రయత్నం చేస్తారు అంటూ ఈ వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube