మనలో చాలామంది బాల్యంలోనే లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు.బాల్యంలో కన్న కలలను నెరవేర్చుకోవడానికి ఎంతోమంది కష్టపడుతుంటారు.
కొంతమంది సులువుగానే లక్ష్యాన్ని సాధిస్తే మరి కొందరు ఎంత ప్రయత్నించినా లక్ష్య సాధన విషయంలో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి.అయితే తండ్రి చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకుని మహేశ్ కుమార్( Mahesh Kumar ) అనే వ్యక్తి కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.
మహేశ్ కుమార్ తన సక్సెస్ గురించి మాట్లాడుతూ బాల్యం నుంచి నాన్న చెప్పిన మాటలతోనే తాను ఐఏఎస్ కావాలని భావించానని ఎంతో కష్టపడి సివిల్స్ లో 200వ ర్యాంక్( Civils 200th Ranker ) సాధించానని తెలిపారు.నా తండ్రే నాకు మంచి మోటివేటర్ అని ఆయన చెప్పుకొచ్చారు.
బోధన్( Bodhan ) పట్టణంలోని కంటం రాములు, యాదమ్మల మొదటి సంతానం అయిన మహేశ్ కుమార్ విద్యుత్ శాఖలో సీనియర్ లైన్ మేన్ గా పని చేస్తున్నారు.
యాదమ్మ( Yadamma ) గవర్నమెంట్ హాస్పిటల్ లో హెల్త్ సూపర్ వైజర్ గా పని చేస్తుండటం గమనార్హం.భార్య సౌమ్య కూడా ఐఏఎస్( IAS ) కావడంతో తన వంతు సహాయసహకారాలు అందించిందని మహేశ్ చెబుతున్నారు.మహేశ్ తల్లి మాట్లాడుతూ తన కొడుకు చదువులో చురుకుగా ఉండేవాడని నవోదయలో సీటు సాధించి చదివాడని అన్నారు.
ఆ ఆనందాన్ని తమ కొడుకు సివిల్స్ లో( Civils ) ర్యాంక్ సాధించే వరకు కొనసాగించాడని మహేశ్ తల్లి చెప్పుకొచ్చారు.
తండ్రి కంటం రాములు( Kamtam Ramulu ) మాట్లాడుతూ నా కొడుకు సివిల్స్ లో ర్యాంక్ సాధించడం పట్టలేనంత సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.విద్యపై మక్కువతో నా కొడుకు ఉన్నత విద్యను అభ్యసించాడని కంటం రాములు చెప్పుకొచ్చారు.మహేశ్ కుమార్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు.
మహేశ్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తుండటం గమనార్హం.