Ram Charan: రామ్ చరణ్ ని ఉపాసన కంటే ముందు నేనే పెళ్లి చేసుకునేదాన్ని.. నటి కామెంట్స్ వైరల్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ( Ram Charan,Upasana ) ని 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరి పెళ్లయి దాదాపు పది సంవత్సరాల తర్వాత వీరికి ఒక పాప పుట్టింది.

 I Used To Marry Ram Charan Before Upasana Actress Comments Viral Tollywood-TeluguStop.com

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓ హీరోయిన్ ఉపాసన కంటే ముందే రామ్ చరణ్ ని నేనే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.ఇక రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.

వైజాగ్ కి చెందిన హీరోయిన్ జ్ఞానేశ్వరి అంటే ఎవరికి అంతగా గుర్తుపట్టరు.కానీ మంత్ ఆఫ్ మధు ( Month of madhu ) సినిమాలో కలర్స్ స్వాతికి అందంలో గట్టి పోటీని ఇచ్చి నవీన్ చంద్రతో డేటిం** చేయడానికి రెడీ అయింది హీరోయిన్ జ్ఞానేశ్వరి.

Telugu Colours Swathi, Dootha Web, Gnaneshwary, Madhu, Naga Chaithanya, Naveen C

ఈ సినిమాలో కలర్స్ స్వాతి కంటే ఎక్కువ గుర్తింపు జ్ఞానేశ్వరి కే వచ్చింది.ఇందులో తన హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేసింది.ఇక రీసెంట్ గా నాగచైతన్య ( Naga chaithanya ) చేసిన దూత వెబ్ సిరీస్ లో కూడా దయ్యాల మీద రీసెర్చ్ చేసే యూట్యూబర్ గా కొద్దిసేపు కనిపించి ఆ తర్వాత చనిపోతుంది.అయితే ఈ దూత వెబ్ సిరీస్ లో ఈమె స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉన్నప్పటికీ జ్ఞానేశ్వరి కి మంచి గుర్తింపు వచ్చింది.

అలా ఈ రెండు సినిమాల ద్వారా జ్ఞానేశ్వరి తానేంటో అందరికీ నిరూపించుకుంది.

Telugu Colours Swathi, Dootha Web, Gnaneshwary, Madhu, Naga Chaithanya, Naveen C

ఇక ఈ రెండు సినిమాల్లో ఉన్న గుర్తింపు వల్ల జ్ఞానేశ్వరి కి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని ఈమె నటన చూసిన చాలామంది అభిప్రాయపడుతున్నారు.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్ఞానేశ్వరి రామ్ చరణ్ ( Ram Charan ) గురించి మాట్లాడుతూ.నాకు రామ్ చరణ్ అంటే చెప్పలేనంత ఇష్టం.

ఎంతలా అంటే నా బుక్స్ లో మొత్తం రామ్ చరణ్ కి సంబంధించిన ఫోటోలే ఉండేవి.ఇక ఒక పది సంవత్సరాల ముందు రాంచరణ్ ని గనుక నేను కలిస్తే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్ని.

కానీ ఇప్పుడు ఏం చేయలేను.ఒకవేళ ఇప్పుడు కలిస్తే మాత్రం మీ సినిమాలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాను అంటూ జ్ఞానేశ్వరి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం హీరోయిన్ జ్ఞానేశ్వరి (Gnaneshwary) రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube