నాకు ప్రతి శుక్రవారం పెళ్లి జరుగుతుంది... తమన్నా కామెంట్స్ వైరల్!

హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంతకాలానికే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం తమన్నా(Tamannaah ) బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగు సినిమాలలో నటించటం పూర్తిగా తగ్గించింది.F3 సినిమా తర్వాత ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు.ఇదిలా ఉండగా కొంతకాలంగా బాలీవుడ్ నటుడుతో తమన్నా రిలేషన్‌ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 I Get Married Every Friday Tamannaah Comments Go Viral ,tamannaah , Bollywood ,t-TeluguStop.com

ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మ(Vijay Varma)తో కొంతకాలంగా తమన్నా డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది.ఈ ఏడాది గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో(New Year Party) ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించడంతో వీరి రిలేషన్‌ గురించి వార్తలు మొదలయ్యాయి.అంతే కాకుండా ఆతర్వాత కూడా విజయ్‌ను ముద్దు పేరుతో పిలుస్తూ తమన్నా సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేయడంతో వీరి రిలేషన్ కి సంబందించిన వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈక్రమంలో విజయ్‌వర్మతో రిలేషన్‌షిప్‌ వార్తలపై స్పందించింది తమన్నా.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించి ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా విజయ్ తో రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.ఈ ఇంటర్వ్యులో తమన్నా మాట్లాడుతూ.‘నేను, విజయ్‌ వర్మ కలిసి ఒక సినిమా చేశాం.

అప్పటి నుంచి మా పై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు.

మాకు నుంచి బిజినెస్‌మెన్‌ వరకూ .ఇలా అందరితో మాకు పెళ్లిళ్లు చేసేస్తారు.నాకు నిజంగా పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియడం లేదు.అప్పటివరకూ వాళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండగలరా? అప్పటికి మరోదాని గురించి ఆలోచిస్తుంటారేమో’ అంటూ తమన్నా సటైర్లు వేసింది .ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.u

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube