జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ అమాయకుడో, పిచ్చోడో తెలియడం లేదని తెలిపారు.
సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శించారు.పార్టనర్ తప్పు చేసినప్పుడు తప్పు అని పవన్ కల్యాణ్ చెప్పాలని వెల్లడించారు.
సొంత కుమారుడు లోకేశ్ కన్నా దత్తపుత్రుడు పవనే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు అరెస్టును ప్రజలు స్వాగతిస్తున్నారన్న ఆయన చట్టానికి ఎవరికీ అతీతులు కాదని స్పష్టం చేశారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
.