నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .."నల్లమల" సక్సెస్ మీట్ లో దర్శకుడు రవి చరణ్

నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం “న‌ల్ల‌మ‌ల‌”.

 I Am Very Happy That My First Film Is Getting So Much Popularity Director Ravi-TeluguStop.com

మార్చి 18 శుక్రవారం థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయులసమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు.రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ , ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు.ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది.

మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపించేలా ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు.సినిమా ఇంత బాగా రావడానికి ముందు మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు.

నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు.నా టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడ్డారు.

నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మా నల్లమల సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ భానుశ్రీ‌ మాట్లాడుతూ.మంచి కంటెంట్ తో విడుదలైన మా నల్లమల చిత్రం చాలా బాగుందని చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు.ముఖ్యంగా “ఎమున్నావే.పిల్లా ” సాంగ్ కు ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.

ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా చాలా బ్యూటీఫుల్ ఉంది.విజువల్స్ గాని, మేకింగ్,టేకింగ్ గాని అద్భుతంగా వచ్చాయి.

సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది.భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube