తెలంగాణలో ఎన్నికల వేడి తారస్థాయిలో కొనసాగుతోంది.మరో 25 రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో డిసెంబర్ 3 న పార్టీల భవిష్యత్ తేలిపోనుంది.
ప్రస్తుతం అధికార బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్య త్రిముఖ పోటీ నెలకొంది.గతంతో పోల్చితే ఈసారి మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత తొమ్మిదేళ్లలో పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ అధికారం కోసం బిఆర్ఎస్( BRS ) ఆరాటపడుతుంటే.ఈసారి బిఆర్ఎస్ కు చెక్ పెట్టి తాము అధికారం చేపట్టాలని చూస్తున్నాయి కాంగ్రెస్,( Congress ) బీజేపీ( BJP ) పార్టీలు.
ఈసారి సర్వేలు కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుండడంతో అధికారం ఏ పార్టీని వరిస్తుందనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేని పరిస్థితి.ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలను కూడా హంగ్ భయం పట్టుకుంది.
ఒకవేళ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు రాకపోతే ఎలా అనే ఆందోళన అన్నీ పార్టీలను కలవరపెడుతోందట.

ఒకవేళ హంగ్ ఏర్పడితే( Hung ) మిత్రపక్ష పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.తెలంగాణలో అధికారం కోసం 119 సీట్లకు గాను 60 సీట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ 45-50 సీట్లు సాధించిన ఏంఐఏం( MIM ) సపోర్ట్ తో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది కొందరి వాదన.
ఎందుకంటే బిఆర్ఎస్ కు ఏంఐఏం మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది.గ్రేటర్ హైదరబాద్ పరిధిలో దాదాపు 11-17 స్థానాల్లో మజ్లిస్ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.దాంతో మజ్లిస్ మద్దతు బిఆర్ఎస్ కు ప్రధాన బలం.ఇక కాంగ్రెస్ విషయానికొస్తే గతంతో పోల్చితే కాంగ్రెస్ కు సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోతే.ఆ పార్టీకి ఎవరి మద్దతు ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న.

హస్తం పార్టీకి వామపక్షాల మద్దతు ఎంతవరకు ఉంటుందనేది సందేహమే.ఎందుకంటే వాటిమద్య పొత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు.పైగా ఒకటి రెండు స్థానాలను మినహాయిస్తే వామపక్షాలు ప్రభావం చూపే సీట్లు చాలా తక్కువ.ఈ నేపథ్యంలో హాంగ్ ఏర్పడిన కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగం లేదనేది కొందరి అభిప్రాయం.
ఇక బీజేపీ ( BJP ) విషయానికొస్తే సర్వేలు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం 10-20 సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉందట.ప్రస్తుతం బీజేపీకి జనసేన( Janasena ) మాత్రమే మిత్రపక్షంగా ఉంది.
జనసేన పార్టీ తెలంగాణలో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ.అందువల్ల హంగ్ ఏర్పడితే బీజేపీకి కలిసొఛెదేమి లేదు.
మొత్తానికి మూడు ప్రధాన పార్టీలను కూడా హంగ్ భయం పట్టుకుంది.మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుదో చూడాలి.