సూపర్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన లియో సినిమా( Leo )కు బాక్సాఫీస్ వద్ద వస్తున్న వసూళ్లు, ఇప్పటికే నమోదు అయిన వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.లోకేష్ కనగరాజ్ సినిమా అవ్వడం తో భారీ ఓపెనింగ్స్ అయితే లభించాయి.
కానీ ఆ ఓపెనింగ్స్ భారీ వసూళ్లు గా నమోదు అవ్వడం లేదు.రెండో రోజు నుంచే లియో సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యాయి.
తమిళేతర రాష్ట్రాల్లో సినిమా వసూళ్లు మరీ డల్ గా ఉండటం తో భారీ గా వసూళ్లు నమోదు అవ్వడం లేదు.లియో సినిమా విడుదలకు ముందు విజయ్ ఫ్యాన్స్ ఇది వెయ్యి కోట్ల సినిమా అంటూ గట్టిగా వాదించారు.
కానీ సినిమా ఫలితం మొత్తం కూడా తారు మారు అయింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి.ఆకట్టుకునే కథ మరియు కథనం లేకపోవడంతో సినిమా కు వసూళ్లు రావడం లేదు.దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో అయింది అన్నట్లుగా చాలా మంది పెదవి విరుస్తున్నారు.
ఈ రేంజ్ లో విజయ్ నుంచి సినిమా ను ఆశించలేదు అంటున్నారు.తమిళనాడు( Tamil Nadu ) లో మొదటి వారం రోజులు గౌరవ ప్రధంగా వసూళ్లు నమోదు అయ్యాయి కనుక రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
హిందీ మరియు ఇతర తమిళేతర భాషల్లో సినిమా మంచి వసూళ్లు సాధించి ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ అనుకున్న వెయ్యి కోట్ల మార్క్ ను లియో ఈజీగా దాటే వాడు.కానీ లియో సినిమా విజయ్ ఫ్యాన్స్ ఆశించిన వసూళ్ల లో కనీసం సంగం కూడా దక్కించుకోలేక పోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.విజయ్ ఫ్యాన్స్ కి వెయ్యి కోట్ల వసూళ్లు అందని ద్రాక్ష మాదిరిగానే ఉంది కదా అంటూ ఫ్యాన్స్ నిటూర్చుతున్నారు.