దేశ రాజధాని ఢిల్లీ( Delhi )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.అలీపూర్ లోని ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సుమారు 34 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.