సినిమా ఇండస్ట్రీలో ప్రేమ,పెళ్లి విడాకులు సాధారణం అనే సంగతి తెలిసిందే.అయితే కొంతమంది సెలబ్రిటీలు రెండో పెళ్లిపై ఆసక్తి చూపిస్తే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం రెండో పెళ్లి చేసుకోవడాన్ని తప్పుగా భావిస్తారు.
అయితే 49 సంవత్సరాల వయస్సులో కూడా రెండో పెళ్లి చేసుకోవాలని స్టార్ హీరో హృతిక్ రోషన్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
కొన్ని సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్ తన భార్య సుసాన్ తో విడిపోగా ఆమె విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జోడీ విడిపోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో హర్ట్ చేసింది.అయితే హృతిక్ రోషన్ కు ఇప్పటికే పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఈ హీరో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.గత కొంతకాలం నుంచి హృతిక్ రోషన్ సబా అజాద్ తో ప్రేమలో ఉన్నారు.

ఈ ప్రేమ పెళ్లిగా మారబోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.హృతిక్ పిల్లలు సైతం అతని ప్రేమ పెళ్లి విషయంలో ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హృతిక్ రోషన్ త్వరలో తన రెండో పెళ్లికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.హృతిక్ రోషన్ రెండో పెళ్లి బంధం నిలబడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకోవద్దని కొంతమంది అభిమానులు సూచనలు చేస్తున్నారు.హృతిక్ రోషన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.హృతిక్ రోషన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.హృతిక్ రోషన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.