బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య టాప్ ఫైట్ ఉండే స్థానాలు ఎన్నంటే..?

గత రెండు పర్యాయాల ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ పార్టీ ( Congress party ) బీఆర్ఎస్ ని ఎదుర్కోవడంలో విఫలమైంది.దీనికి ప్రధాన కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఎత్తులకు పై ఎత్తులు వేయకపోవడం వల్లే ఓటమి చవిచూసింది అని చెప్పవచ్చు.

 How Many Seats Are The Top Fight Between Brs-congress , Brs, Congress, Cwc, Delh-TeluguStop.com

రేవంత్ రెడ్డి ( Revanth reddy ) టీపిసిసి అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.ఏ పని చేసినా సిస్టమేటీక్ గా ఒక లైన్ ప్రకారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలి అంటే మామూలు విషయం కాదు.ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా వెళ్తే విజయం సాధించగలమో, ఆ విధంగానే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా కేవలం 40 నుంచి 45 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది.అక్కడ కూడా టాప్ పోటీ ఉండబోతోంది.ఈ 40 సీట్ల అభ్యర్థులను కాంగ్రెస్ 17న నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రకటించనున్నారు.ఈ సీట్లే కాంగ్రెస్ కు కలిసి వస్తాయి.

ఇక మిగతా సీట్లు గెలవాలి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ( BRS ) తో చాలా పోరాడాలని కాంగ్రెస్ తరపున సర్వే చేసినటువంటి సునీల్ తెలియజేసినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రతి నియోజకవర్గంలో సునీల్ కనుగోలు ( Sunil kanugolu ) ద్వారా గ్రౌండ్ లెవెల్ సర్వే చేయించినట్టు తెలుస్తోంది.

Telugu Congress, Delhi, Revanth Reddy, Sunil Kanugolu, Telangana-Latest News - T

ఈ సర్వే ఆధారంగానే తప్పనిసరిగా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి పేవర్ గా ఉందో ఆ అభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.ఇందులో ముఖ్యంగా గెలిచే సీట్లు 40 నుంచి 45 వరకు ఉంటాయని సునీల్ కొనుగోలు చెప్పినట్టు సమాచారం.అలాగే ఇంకో 50 సీట్లు ప్రతి నియోజకవర్గంలో నువ్వా నేనా అనే విధంగా ఫైట్ జరుగుతుందని, ఇంకో 30-35 సీట్లు అసలు వస్తాయా రావే అనే విధంగా సర్వే లో తేల్చినట్టు సమాచారం.

Telugu Congress, Delhi, Revanth Reddy, Sunil Kanugolu, Telangana-Latest News - T

అయితే 40సీట్లు అయితే పక్కా గెలుపు వరిస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.ఇంకా 40 నుంచి 50 సీట్ల కోసం ప్రతి నియోజకవర్గంలో ఢిల్లీ ( Delhi ) అగ్రస్థాయి నేతలను దించి ప్రచారం చేయించాలని చూస్తున్నట్లు సమాచారం.ఒకవేళ వీరి ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం పక్క గెలిచే సీట్లు 40కి, ఇంకో 20 సీట్లు గెలవగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

దాని కోసమే కాంగ్రెస్ సిడబ్ల్యూ సి ( CWC ) సమావేశాలు ఏర్పరిచి దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.మరి చూడాలి వీరి ప్లాన్లు వర్క్ అవుట్ అవుతాయా.

లేదంటే బీఆర్ఎస్ (BRS) మళ్లీ అధికారంలోకి వస్తుందా.అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube