కొర్రపంట సాగులో అశించు చీడపీడలు.. నివారణ కోసం చర్యలు..!

కొర్రపంట సాగును( Korra crop ) వర్షాధారంగా, ఆరుతడి పంటగా, నీటి ఎద్దడి సమస్య ఉన్న కూడా సాగు చేయవచ్చు.

కానీ పంటకు కనీసం రెండు నీటి తడులు కచ్చితంగా అందిస్తేనే దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తుంది.

నీటి వనరులు ( Water resources )ఉంటే నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.వేసవికాలంలో ఆఖరి దుక్కిలో మూడు టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) వేసి కలియదున్నాలి.

ఇక ఎకరాకు మూడు కిలోల విత్తనాలు అవసరం.గోరుతో విత్తనాలు వేసే సమయంలో వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

విత్తుకునే సమయంలో ఎకరాకు 6 కేజీల నత్రజని, ఆరు కిలో కేజీల భాస్వరం వేయాలి.

Advertisement

పంట వేసిన నాలుగు వారాల తర్వాత ఒక నీటి తడి పారించి 6 కిలోల నత్రజని వేయాలి.నీటి వసతులు ఉంటే గింజ దిగుబడి మెరుగుగా ఉండి, గడ్డి కూడా పొడవుగా పెరుగుతుంది.నల్లరేగడి భూములలో వర్షాధారంగా కొర్ర పంటను సాగు చేస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.

కొర్ర పంటను వివిధ రకాల చీడపీడలు ఆశిస్తాయి.పంట వేసిన నెల తర్వాత పూత రావడం ప్రారంభం అవుతుంది.

సమయంలో బెట్ట తగలకుండా కాపాడుకుంటే 60 రోజులలో గింజలు పరిపక్వానికి వస్తాయి.ఇక గింజలలో తేమశాతం 10 నుండి 12 ఉంటే దీర్ఘకాలం నిలువ ఉంటాయి.

వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కురిసినప్పుడు పలు రకాల పురుగులు పంటను ఆశిస్తాయి.కొర్ర మొక్క వేర్ల కు చెదలు ఆశించటంతో మొక్కలు వాడి చనిపోతాయి.చివరి దుక్కిలో ఫాలిడాల్ 2 శాతం పొడిను ఎకరాకు పది కిలోల చొప్పున భూమిలో కలిసేలాగా వేయాలి.కాండం తొలచు పురుగులు, గులాబీ రంగు పురుగుల నుండి కాపాడుకోవాలంటే ఒక లీటర్ నీటిలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు కలిపి పంట వేసిన నెలలోపు పిచికారి చేయాలి.

వైరల్: ఇందుకే కాబోలు సచిన్ ను క్రికెట్ గాడ్ అనేది..
Advertisement

తాజా వార్తలు