మీరు జపాన్‌లోని ( Japan ) టోక్యోలో ఉన్నారని ఊహించుకోండి.అప్పుడే విమానాశ్రయం నుంచి బయటికి వచ్చి టాక్సీ ఎక్కుదామని అనుకున్నారనుకోండి.
కానీ బయటికి వెళ్లినప్పుడు క్యాబ్‌లలో డ్రైవర్లు లేకుండా వాటి అంతటవే ప్రయాణిస్తున్నాయని చూస్తే ఎలా ఉంటుంది.ఆశ్చర్యపోవడం, నివ్వెరపోవడం, అబ్బురపడటం ఒకేసారి జరుగుతుంది కదా.అయితే ఆ కార్లు మాయాజాలంతో ఏమీ నడవవు.అవన్నీ మానవ సహాయం లేకుండా మిమ్మల్ని మీ గమ్యస్థానానికి తీసుకెళ్లగల సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు.
నిజానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు( Self Driving Cars ) అందుబాటులోకి వచ్చాయి కానీ క్యాబ్‌లు రోడ్లపై తిరుగుతూ వాటి అంతటవే ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్లేవి చాలా తక్కువ.

ఈ విశేషాలన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా జపాన్ కి చెందిన హోండా( Honda ) జనరల్ మోటార్స్( General Motors ) దీన్ని నిజం చేసేందుకు ప్లాన్ చేశాయి.టోక్యోలో డ్రైవర్ లేకుండా డ్రైవ్ చేయగల ఆటానమస్ క్యాబ్‌లను( Autonomous Cabs ) రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాయి.2026లో 500 క్యాబ్‌లతో ప్రారంభించి సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నాయి.క్యాబ్‌లు బాక్సీ వ్యాన్‌ల లాగా ఉంటాయి, లోపల ఆరు సీట్లు ఉంటాయి.వాటికి స్టీరింగ్ వీల్ లేదా డ్రైవర్ సీటు ఉండదు.రోడ్లపై నావిగేట్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి సెన్సార్లు, కెమెరాలను ఉపయోగిస్తాయి.

అసలు డ్రైవర్ లేకుండా కార్లు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారనే సందేహం రావడం కామన్.అయితే జపాన్‌లో క్యాబ్ డ్రైవర్ల కొరత ఉంది.వారిలో చాలా మంది మహమ్మారి సమయంలో తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు, ఇప్పుడు వారు తగినంతగా లేరు.
అటానమస్ క్యాబ్‌లు ఈ సమస్యను పరిష్కరించగలవు, ప్రయాణీకులకు అనుకూలమైన సేవలను అందించగలవు.అయితే అటానమస్ డ్రైవింగ్ పట్ల ఆసక్తి ఉన్న దేశం జపాన్ మాత్రమే కాదు.అమెరికా, చైనాలు కూడా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి తమ రోడ్లపై పరీక్షిస్తున్నాయి.వారికి జపాన్ కంటే భిన్నమైన సవాళ్లు, అవకాశాలు ఉన్నాయి.
ఉదాహరణకు, జపాన్ ఒక చిన్న-కార్ మార్కెట్, ఇక్కడ ప్రజలు చౌకైన, కాంపాక్ట్ కార్లను ఇష్టపడతారు.వారికి అటానమస్ డ్రైవింగ్ కార్లు మరింత ఖరీదైనదిగా, పెద్దదిగా ఉంటాయి.