శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది తమన్నాభాటియా.జయాపజయాలకు అతీతంగా ఆమె అవకాశాలను అందుకుంటూ ఇప్పటికీ వరుస సినిమాలతో తమన్నా బిజీగా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో తమన్నా నటించిన బాహుబలి, సైరా సినిమాలు నటిగా తమన్నాకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి.ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగుతో పాటు తమిళ సినిమా ఆఫర్లు ఉన్నాయి.
తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించిన తమన్నా కెరీర్ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి తాను అడుగుపెట్టిన సమయంలో తనపై విమర్శలు వచ్చావని.
తను నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో బాధ పడ్డానని పేర్కొన్నారు.తాను గతాన్ని తలచుకుని ఎప్పుడూ బాధ పడనని తమన్నా తెలిపారు.

గతంలో జరిగిన విషయాల ద్వారా భవిష్యత్తును అందంగా మలిచే విధంగా ప్రణాళికలను వేసుకుంటానని చెప్పారు.తన సినిమా కెరీర్ ముగిసిపోయిందంటూ, తాను కష్టాల్లో ఉన్నానంటూ వార్తలు వచ్చాయని పేర్కొన్నారు.తాను ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠాలలో తప్పొప్పుల గురించి తెలుసుకుంటూ ముందడుగులు వేస్తున్నానని ఆమె అన్నారు.తన గురించి నెగిటివ్ గా వచ్చిన వార్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ఆమె అన్నారు.
అలాంటి వార్తలు తాను మరింత కష్టపడటానికి అవసరమైన ప్రోత్సాహాన్ని నింపాయని తమన్నా పేర్కొన్నారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్, నంబర్ గేమ్స్ ఉండవని.
కష్టపడితే మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.తన కష్టానికి అదృష్టం తోడైంది కాబట్టే 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నానని పేర్కొన్నారు.
స్టార్ హీరోయిన్ తమన్నా తన కెరీర్ మొదట్లో ఇన్ని కష్టాలు పడ్డారా.? అని నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.