తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సంజనా గల్రానీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పేరు వినగానే మనకు ముందుగా బుజ్జిగాడు సినిమా గుర్తుకు వస్తుంది.
ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ సంజనా గల్రానీ.మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.కాగా సంజనా మొదట12 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ 100కు పైగా యాడ్స్ లో నటించి మెప్పించింది.
ఇకపోతే సంజనా గల్రానీ గత ఏడాది ఏప్రిల్లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఈమె కి కర్ణాటకకు చెందిన డాక్టర్ షాషాను పెళ్లి చేసుకుంది.
కాగా ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సంజనా గల్రానీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ నేపథ్యంలోని ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది.ఈ సందర్భంగా సంజనా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
తాను కెరియర్ మొదట్లో ఎన్నో రకాల చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది.సదరు యాంకర్ మీరు క్లియర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకుంటూ ఈ స్టేజ్ కు వచ్చారు.
అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా నమ్మినవాళ్లే అనడంతో అవును అని అంటుంది సంజనా.
ఒక తెలియని వ్యక్తి నుంచి మనకు ఏదైనా సమస్య వస్తే దానిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లవచ్చు.కానీ మన చుట్టూ ఉన్నవాళ్లే ఒకరకంగా దానిని వెన్నుపోటు అనవచ్చు అనడంతో అవును అని అంటుంది సంజనా.అటువంటి సిచ్యువేషన్ ని మీరు ఏ విధంగా ఫేస్ చేశారు అని అడగగా.
మేము ఒక టార్గెట్ రీచ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది.అంటే మంచి ఆలోచనలు ఉన్నవారికి మంచిగా ఆలోచించే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అని అంటుంటారు.
కానీ ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వారికి ప్రత్యేకంగా ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు వాళ్ల జీవితాలు వారి నాశనం చేసుకుంటారు అని తెలిపింది సంజునా.కానీ నేను నా దేవుడని నమ్ముతాను నేను ఎప్పుడూ కరెక్ట్ గానే ఉన్నాను అని అంటుంది సంజనా.
నేను ఇండస్ట్రీలో 12 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చాను.స్వతహాగా కష్టపడినా టాలెంతో నేను ఈ స్టేజి కి వచ్చాను.కానీ ఇలా పైకి వచ్చిన వాళ్ల మీద నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు.నేను నా ఇన్నేళ్ల కెరియర్ లో చాలామంది డైరెక్టర్స్ తో పని చేశాను.
వీళ్ళందరికీ నా క్యారెక్టర్ లాంటిది నేను ఎలా ప్రవర్తిస్తాను ఇవన్నీ తెలుసు.అలా వారికి అర్థం అవడం వల్లే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి అని చెప్పుకొచ్చింది సంజనా.
అటువంటి నాపై ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటి పని చేస్తుంది అంటూ వార్తలు క్రియేట్ చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.చాలామంది ఆమె కుట్ర చేసినట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.