టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ వల్ల హీరోలు, నిర్మాతలు పూరీ జగన్నాథ్ పేరు వింటే భయపడే పరిస్థితి నెలకొంది.
తాజాగా పూరీ జగన్నాథ్ ఇడియట్ మూవీ షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పూరీ మ్యూజింగ్స్ లో రియాక్షన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడిన పూరీ జగన్నాథ్ లైఫ్ లో చాలా జరుగుతాయని జరుగుతుంటాయని అన్నారు.
ఆ జరిగే వాటిపై మనకు కంట్రోల్ ఉండదని ఆయన కామెంట్లు చేశారు.మన చేతిలో ఉండేది కేవలం రియాక్షన్స్ ఇవ్వడం మాత్రమేనని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.
ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ముఖ్యమని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
విపరీతమైన కోపంలో ఉన్న సమయంలో అస్సలు సమాధానం చెప్పొద్దని ఆయన కామెంట్లు చేశారు.
ఇడియట్ మూవీ షూట్ సమయంలో ఒక సన్నివేశంలో రక్షిత సరిగ్గా చేయడం లేదని ఏడ్చే సీన్ షూట్ సమయంలో తను నవ్వుతూ ఉండటంతో నాకు చాలా కోపం వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో నేను రక్షితతో రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు.
ఇలా చేస్తే తర్వాత సినిమాలో క్యారెక్టర్ రాయను అని అన్నానని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.
ఆ సమయంలో రక్షిత నాకు క్యారెక్టర్ రాయి.రాయకపోతే చంపేస్తాను అని చెప్పిందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.నా తర్వాత పది సినిమాలు కూడా తనే చేస్తానని ఏం జరిగిందో చెప్పి చావు అంటూ తను కామెంట్ చేసిందని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
రక్షిత అలా స్పందించడంతో నాకు నవ్వాగలేదని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.రక్షిత నుంచి ఊహించని సమాధానం రావడంతో ఆమెపై కోపం పోయిందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.