హీరోయిన్ లయ ఇప్పుడు ఎలా ఉందో చూసారా.. వీడియో వైరల్!

సీనియర్ హీరోయిన్ లలో లయ ఒకరు.ఈమె తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగానే గుర్తు ఉంది.

 Senior Heoine Laya Gorty Latest Pics On Instagram Details, Laya Gorty, Instagram-TeluguStop.com

ఆమె చేసిన సినిమాలు ఇప్పటికీ కూడా ఆమెను గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాయి.హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకుని ఈమె వెండి తెరకు దూరం అయ్యింది.

అయినా కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూనే ఉంది.

లయ తెలుగులో మంచి మంచి పాత్రలు పోషించింది.

ఈమె 1992లో బద్రం కొడుకో సినిమాతో తెలుగు తెర మీదకు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈమె వేణు కు జంటగా 1999లో వచ్చిన స్వయంవరం సినిమా తో ఆమె కెరీర్ టర్న్ అయ్యింది.

ఇక్కడి నుండి ఈమె వెనుతిరిగి చూసుకోలేదు.వరుస అవకాశాలు అందుకుంటూ మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె చేసే ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది.ప్రెసెంట్ సోషల్ మీడియాలో కుదిపేస్తున్న కచ్చా బాదం పాటకు లయ డ్యాన్స్ చేసింది.

ఆ పాటకు ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు డ్యాన్స్ చేసి అలరించిగా ఇప్పుడు లయ చేసి అలరించింది.చీర కట్టులో సింపుల్ స్టెప్పులతో ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ లయను ఇలా చూడడంతో ఆమె అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈమె రీఎంట్రీ కూడా ఇవ్వబోతుంది అనే వార్తలు వస్తూనే ఉన్నారు.అయితే ఆమె ఇమేజ్ కు తగ్గ పాత్రలు రాకపోవడంతో ఈమె రీఎంట్రీ కి వెనక్కి తగ్గుతుందట.

అప్పటికి ఇప్పటికి లయలో ఎటువంటి మార్పు రాలేదు.

ఈ వీడియో చూసి ప్రేక్షకులు ఆమెను మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్ లు ఎంతో మంది రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇప్పుడు లయ కూడా మరికొన్ని రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube