నిన్న అరబిక్ కుత్తు.. నేడు జాలి ఓ జింఖానా అంటూ దుమ్ములేపుతున్న విజయ్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు తమిళంలో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

 Hero Vijay Beast Movie Second Song-jolly-o-gymkhana Song Release Promo Details,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా విజయ్ పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బీస్ట్.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తు పాట ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ పాటకు సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మనకు అరబిక్ కుత్తు పాట వినిపించింది.

ఇదిలా ఉండగా తాజాగా బీస్ట్ చిత్రం నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ పాడటం విశేషం.ఇక ఈ పాటను ఈ నెల 19వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఈ పాట ప్రోమోని విడుదల చేయడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.బీచ్ ఒడ్డున మ్యూజిక్ బ్యాండ్ తో రాక్ స్టార్ లా విజయ్ మైక్ పట్టుకొని పాట పాడటం అందరిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోమో చూస్తుంటే నిన్న అరబిక్ కుత్తు పాటలా నేడు జాలి ఓ జింఖానా పాట కూడా రికార్డులు సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని ఏప్రిల్ 14వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube