"నచ్చింది గర్ల్ ఫ్రెండ్" చిత్ర యూనిట్ సమక్షంలో గ్రాండ్ గా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న హీరో రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్

మన యూత్ కు తెలుసు నచ్చింది అన్న తర్వాత ఎంత దూరమైనా వెళ్తాము అని.ఆలా ఈ సినిమాలో హీరో నచ్చింది అన్న తర్వాత ఆ అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు? ఏం చేశాడు? అన్నదే ఈ కథ.డా.సౌజన్య ఆర్.అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్,జెన్నీఫర్, మధు నందన్, శ్రీకాంత్ అయ్యాంగార్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”.ఈ చిత్రం గోవా లో జరిగే ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది.

 Hero Rising Star Uday Shankar Had Grand Birthday Celebrations , Uday Shankar ,a-TeluguStop.com

అయితే.జులై 19 న హీరో రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్ బర్త్ డే పురస్కరించుకొని చిత్ర యూనిట్ కేక్ ను కట్ చేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర హీరో రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్, మాట్లాడుతూ.చంద్ర సిద్దార్థ్ గారి దర్శకత్వంలో “ఆటద రా శివ” తో నా జర్నీ స్టార్ట్ అయ్యి రేపటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది.ఈ నాలుగు సంవత్సరాలలో ఈ సినిమాతో కలిపి నాలుగు సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది.“నచ్చింది గర్ల్ ఫ్రెండ్” సినిమా చాలా బాగా వచ్చింది.ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు గురు పవన్ మంచి కథను సెలెక్ట్ చేసుకుని కమర్సియల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాత అట్లూరి నారాయణ రావు గారు నిర్మిస్తున్నారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.

హీరోయిన్ జెన్నీఫర్ మ్యానువల్ కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది.ఇందులో మధు నందన్ ఫ్రెండ్ గా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశాడు.అలాగే శ్రీకాంత్ అయ్యాంగార్, గాయత్రి భార్గవి, ఆచార్య లో విలన్ గా చేసిన సౌరవ్ ఇలా అనేకమంది సీనియర్ నటులు ఇందులో ఉన్నారు.మిస్ మ్యాచ్ సినిమాకు సంగీతం అందించిన గిఫ్టన్ ఎలియాస్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఈ మూవీ ను వైజాగ్ లో షూట్ చేశాము.

ఇందులో అడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

Telugu Atluri Yana Rao, Grand, Guru Pawan, Jennifer, Madhu Nandan, Uday Shankar-

చిత్ర నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ.మా గురువు గారు శ్రీ రామ్ అయన పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసి తీసిన మొదటి చిత్రమిది.మా:”నచ్చింది గర్ల్ ఫ్రెండ్” చిత్ర హీరో రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్ కు మా చిత్ర యూనిట్ అందరూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది.

దర్శకుడు గురు పవన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.గిఫ్టన్ మ్యూజిక్ బాగా వచ్చింది.

జాతి రత్నాలు సినిమాకు డి.ఓ.పి గా చేసిన సిద్ధం మనోహర్ ఈ సినిమాకు చేస్తున్నాడు.ఇలా ప్రతి ఒక్కరు టెక్నిషియన్స్ మరియు నటీ నటులు అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది.

సగటు ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలతో మంచి కమర్శియల్ లవ్ స్టోరీ ని పూర్తి చేశాము త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.ముందుగా మా రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్ కు బర్త్ డే శుభాకాంక్షలు.“నచ్చింది గర్ల్ ఫ్రెండ్” టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.మన యూత్ కు తెలుసు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాము.ఆలా ఈ చిత్రంలో హీరో ఆ అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు ఏం చేశాడు అన్నదే ఈ కథ.ఒక పాట మినహా సినిమా మొత్తం ఫినిష్ చేసుకొంది.మిగిలిన ఒక్క పాటను గోవాలో షూట్ చేస్తున్నాము.

ఆగష్టు లో పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్ మాట్లాడుతూ.

ఇందులో పాటలు బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు

సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ.”జాతి రత్నాలు” సినిమా తరువాత చేస్తున్న సినిమా “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”.ఇది మంచి టెక్నీకల్ వ్యాలుస్ ఉన్న సినిమా.

ఈ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.

ఆచార్య లో విలన్ గా నటించిన సౌరవ్ మాట్లాడుతూ.

.ఆచార్య సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది.

మంచి కథతో వస్తున్న ఈ సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ గా విలన్ రాణిస్తాను అనే నమ్మకం ఉందని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ సినిమా బాగా వచ్చింది.

ఈ చిత్రం ద్వారా హీరో కు మంచి పేరు వస్తుందని హీరో ఉదయ్ శంకర్ కు బర్త్ డే విసెస్ తెలియజేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube