కోలీవుడ్ హీరో కార్తీ ( Karthi ) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇక సూర్య తమ్ముడిగా కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే కోలీవుడ్ హీరో కార్తీ ఓ స్టార్ హీరోయిన్( Star Heroine ) ని ప్రేమించి కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా కొనిచ్చారట.అంతేకాదు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారట.కానీ చివరికి కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి జరగలేదట.
మరి కార్తీ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు.నిజంగానే ఆ హీరోయిన్ కి ఫ్లాట్ కొనిచ్చారా.
వారి పెళ్లి జరగకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కోలీవుడ్ హీరో కార్తీ లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం మిల్కీ బ్యూటీ తమన్నా ( Tamannaah ) మాత్రమే.
వీరిద్దరి కాంబినేషన్లో ఆవారా( Awara ) , ఊపిరి, సిరుతై వంటి సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమాల్లో నటించే టైంలోనే కార్తీ కి తమన్నా కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి అది కాస్త సహజీవనం వరకు వెళ్లిందట.
ఇక తమన్నా మీద ప్రేమతో కార్తీ చెన్నైలో తనకి ఒక ఖరీదైన ఫ్లాట్ ని కూడా కొనిచ్చారట.
ఇక వీరి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తున్న సమయంలో తమన్నా కార్తి ( Tamannaah-Karthi ) ఇద్దరూ ఆ ఫ్లాట్లోనే చాలా రోజులు ఉన్నారని కోలివుడ్ ఇండస్ట్రీలో చాలా వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలు ఎక్కువగా వినిపించడంతో కార్తీ తండ్రి ఈ విషయం తెలుసుకొని తమన్నాను పెళ్లి చేసుకోవడానికి అస్సలు వీల్లేదని ,అలా అయితే నాకు అస్లు కొడుకే పుట్టలేదని అనుకుంటానని, కుటుంబానికి దూరం కావలసి వస్తుంది అని కండిషన్ పెట్టారట.దాంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కార్తీ తమన్నాకి బ్రేకప్ చెప్పారు.
ఇక తమన్నా ప్రేమ విఫలం( Love Failure ) అవ్వడంతో చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళింది.కానీ ఆ తర్వాత ఇలాగే ఉంటే తన కెరియర్ ఇక్కడితోనే ఆగిపోతుంది అని తన బాధను దిగమింగుకొని ఇండస్ట్రీలో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతోంది.అయితే ఇప్పటికి కూడా చెన్నై( Chennai ) లో తమన్నా పేరు మీద ఫ్లాట్ ఉందని ఇక కార్తీ తో బ్రేకప్ అయ్యాక ఫ్లాట్ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే కార్తీ మాత్రం మన ప్రేమకి గుర్తుగా ఫ్లాట్ అలాగే ఉండనివ్వు అని చెప్పారని మీడియాలో టాక్ వినిపించింది.