Karthi: స్టార్ హీరోయిన్ ని ప్రేమించి కోట్ల విలువ చేసే ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన కార్తీ.. కానీ చివరికి..?

కోలీవుడ్ హీరో కార్తీ ( Karthi ) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక సూర్య తమ్ముడిగా కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

"""/" / అయితే కోలీవుడ్ హీరో కార్తీ ఓ స్టార్ హీరోయిన్( Star Heroine ) ని ప్రేమించి కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా కొనిచ్చారట.

అంతేకాదు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారట.కానీ చివరికి కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి జరగలేదట.

మరి కార్తీ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు.నిజంగానే ఆ హీరోయిన్ కి ఫ్లాట్ కొనిచ్చారా.

వారి పెళ్లి జరగకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.కోలీవుడ్ హీరో కార్తీ లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం మిల్కీ బ్యూటీ తమన్నా ( Tamannaah ) మాత్రమే.

వీరిద్దరి కాంబినేషన్లో ఆవారా( Awara ) , ఊపిరి, సిరుతై వంటి సినిమాలు వచ్చాయి.

అయితే ఈ సినిమాల్లో నటించే టైంలోనే కార్తీ కి తమన్నా కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి అది కాస్త సహజీవనం వరకు వెళ్లిందట.

ఇక తమన్నా మీద ప్రేమతో కార్తీ చెన్నైలో తనకి ఒక ఖరీదైన ఫ్లాట్ ని కూడా కొనిచ్చారట.

"""/" / ఇక వీరి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తున్న సమయంలో తమన్నా కార్తి ( Tamannaah-Karthi ) ఇద్దరూ ఆ ఫ్లాట్లోనే చాలా రోజులు ఉన్నారని కోలివుడ్ ఇండస్ట్రీలో చాలా వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలు ఎక్కువగా వినిపించడంతో కార్తీ తండ్రి ఈ విషయం తెలుసుకొని తమన్నాను పెళ్లి చేసుకోవడానికి అస్సలు వీల్లేదని ,అలా అయితే నాకు అస్లు కొడుకే పుట్టలేదని అనుకుంటానని, కుటుంబానికి దూరం కావలసి వస్తుంది అని కండిషన్ పెట్టారట.

దాంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కార్తీ తమన్నాకి బ్రేకప్ చెప్పారు. """/" / ఇక తమన్నా ప్రేమ విఫలం( Love Failure ) అవ్వడంతో చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళింది.

కానీ ఆ తర్వాత ఇలాగే ఉంటే తన కెరియర్ ఇక్కడితోనే ఆగిపోతుంది అని తన బాధను దిగమింగుకొని ఇండస్ట్రీలో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

అయితే ఇప్పటికి కూడా చెన్నై( Chennai ) లో తమన్నా పేరు మీద ఫ్లాట్ ఉందని ఇక కార్తీ తో బ్రేకప్ అయ్యాక ఫ్లాట్ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే కార్తీ మాత్రం మన ప్రేమకి గుర్తుగా ఫ్లాట్ అలాగే ఉండనివ్వు అని చెప్పారని మీడియాలో టాక్ వినిపించింది.

వైరల్ వీడియో: ప్రభుత్వ టీచర్ పై బూతుపురాణం అందుకున్న రేషన్ డీలర్..