గత 6 నెలల నుండి ఐసిసి సంబంధించిన చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ఈ పోస్ట్ కు అనేక కంపెనీలకు డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి గ్రెగ్ బార్క్‌లే ఎన్నికయ్యారు.
ఈయన ఇదివరకు న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.భారతదేశానికి చెందిన శశాంక్ మనోహర్ ఆరు నెలల క్రితం ఐసిసి అధ్యక్ష పదవి కాలం ముగిసిన ఇంతవరకు ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు.
2012 సంవత్సరం నుంచి న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తాజాగా శశాంక్ తర్వాత ఐసీసీ రెండో స్వతంత్ర చైర్మన్ గా ఎన్నికయ్యారు.ప్రస్తుతం ఐసిసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా ను ఆయన ఓడించి ఈ స్థానాన్ని సంపాదించారు.
ఇదివరకు శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.ఇక చివరికి ఖవాజా, గ్రెగ్ బార్క్‌లే లు చైర్మన్ పదవికి పోటీ పడగా తొలి రౌండ్ లో ఇమ్రాన్ ఖవాజాకు 6 ఓట్లు పడగా, గ్రెగ్ కు 10 ఓట్లు పడ్డాయి.
ఆ తర్వాత రెండో రౌండులో దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఓటు గ్రెగ్ కు పడటంతో మొత్తం రెండో వంతు మెజారిటీ సాధించడంతో గ్రెగ్ చైర్మన్ పదవిని చేపట్టారు.

ఇదివరకు గ్రెగ్ 2015 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచ క్రికెట్ ప్రపంచకప్ కి డైరెక్టర్ గా పనిచేశారు కూడా.ఈ సందర్భంగా ఆయన కొత్త చైర్మన్ గా ఎన్నికైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.తనకు ఈ పదవికి ఎన్నిక కావడం గర్వకారణం అని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే తనకు మద్దతు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.క్లిష్టమైన సమయంలో క్రికెట్ ముందుకు తీసుకువెళ్లేందుకు సాయశక్తులా కృషి చేసిన ఖవాజా కు గ్రెగ్ కృతజ్ఞతలు తెలిపాడు.
భవిష్యత్తులో కూడా తాము ఇద్దరం కలిసి పని చేస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు.అయితే ఈ పదవి కోసం ఇదివరకు గంగూలీకి కూడా అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.