ఏపీ పోలీస్ శాఖలో నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.మొత్తం 6,511 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.ఈ మేరకు పాలనా పరమైన అనుమతులను సర్కార్ జారీ చేసింది.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా అధికారులు నియామకాలు చేపట్టనున్నారు.ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2520, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.
దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సమాచారం సేకరించి రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.