అనిమల్ నటుడితో గోపిచంద్ మలినేని సినిమా...హిట్ కొట్టడం పక్క అంటున్న డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఆయన తీసిన మొదటి సినిమా డాన్ శీను నుంచి బాలయ్య బాబు తో చేసిన వీర సింహ రెడ్డి వరకు అన్ని సినిమాలు మంచి సినిమాలు గా పేరు సంపాదించుకున్నాయి.2023 సంక్రాంతి కానుకగా వచ్చిన వీర సింహ రెడ్డి( Veerasimha Reddy ) సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక ఆ తర్వాత రవితేజతో ఒక సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆ సినిమాని స్టార్ట్ చేసినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో ఆ సినిమా పట్టాలెక్కలేదు.

 Gopichand Malineni New Movie With Animal Movie Actor Bobby Deol Details, Gopicha-TeluguStop.com

ఇక దాంతో ఇప్పుడు ఆయనతో చేసే హీరో ఎవరు అనేదే ఒక పెద్ద సమస్యగా మారింది.ఇక ఇప్పటికే ఆయన అజిత్ ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ఈమధ్య రిలీజ్ అయిన అనిమల్ సినిమాలో( Animal Movie ) బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.ఆయన ఈ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయిన కూడా ఆయన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించింది.

 Gopichand Malineni New Movie With Animal Movie Actor Bobby Deol Details, Gopicha-TeluguStop.com
Telugu Animal, Bobby Deol, Bollywood-Movie

ఇప్పుడు తెలుగులో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు.దాంతో గోపిచంద్ మలినేని తన కథని ఆయనకి చెప్పినట్టు గా తెలుస్తుంది ఇక ఆ కథ ఆయనకి నచ్చినట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కబోతుంది అనే విషయం పైన ఇంకా క్లారిటి రావడం లేదు.ఇక ఆయనకి బాలీవుడ్ నుంచి కూడా వరుసగా పది సినిమాల్లో ఆఫర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది.ఒక అనిమల్ సినిమాతో తన ఫేట్ మొత్తం మారిపోయింది అనే చెప్పాలి ఇంతకుముందు పది సంవత్సరాలు నుంచి తను పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు

Telugu Animal, Bobby Deol, Bollywood-Movie

కానీ అనిమల్ సినిమాలో తను పోషించిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు వరుసగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తన ఇంటి ముందు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదే క్రమం లో గోపిచంద్ మలినేని కూడా బాబీ డియోల్ ని( Bobby Deol ) ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది…ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే గోపిచంద్ మలినేని కి కూడా బాలీవుడ్ లో మంచి ఛాన్స్ లు వచ్చే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube