జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ట్రాన్స్‌లేషన్ ఫీచర్

గూగుల్ తన జీమెయిల్ యాప్( Gmail app ) యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.ఇది యూజర్లకు ఈ మెయిల్‌లను ట్రాన్స్‌లేట్ చేసుకోవడానికి సాయపడుతుంది.

 Good News For Gmail Users Translation Feature Available, Good News, Gmail, Accou-TeluguStop.com

కొత్త ఫీచర్ సహాయంతో, యూజర్లు తమ ప్రాధాన్య భాషలో ఈ-మెయిల్‌లను ట్రాన్స్‌లేషన్ చేసుకోగలరు.స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ విడుదల చేయబడింది.గతంలో వెబ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లకు అందుబాటులో ఉంది.“సంవత్సరాలుగా, మా యూజర్లకు వెబ్‌లోని జీమెయిల్‌లో ఇమెయిల్‌లను 100 కంటే ఎక్కువ భాషలలో సులభంగా అనువదించగల సామర్థ్యం ఇవ్వబడింది.ఇక నుంచి ఈ సౌకర్యం మొబైల్ యాప్‌కు( mobile app ) కూడా ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నాము.” మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా బహుళ భాషల్లో కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే స్థానిక ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాము.” అని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.

Telugu Gmail, Google, Ups-Latest News - Telugu

ఈ ఫీచర్ ఇమెయిల్ కంటెంట్ ఏ భాషలో ఉందో గుర్తించి, దానిని టాప్ బ్యానర్‌లో ప్రదర్శిస్తుంది.ఆ తర్వాత యూజర్లు ఒకే ట్యాప్‌లో తమ ప్రాధాన్య లేదా సూచించిన భాషలోకి అనువదించవచ్చు.ఉదాహరణకు ఒక ఇమెయిల్ ఇంగ్లిష్‌లో ఉంటే వారు ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు ఆ టెక్స్ట్‌ను “ట్రాన్స్‌లేట్ ఇన్‌టూ హిందీ”పై నొక్కాలి.

అప్పుడు ఇమెయిల్ హిందీలోకి అనువదించబడుతుంది.మరోవైపు యూజర్లు ఇమెయిల్‌ను ట్రాన్స్‌లేషన్ అవసరం లేదనుకుంటే వారు పైన కనిపించే ఆ ఆప్షన్‌ను తీసివేయవచ్చు.

ఇది మాత్రమే కాకుండా, యూజర్లు నిర్దిష్ట భాష ఇమెయిల్‌లను ట్రాన్స్‌లేషన్ అవకుండా ఉండే సదుపాయాన్ని కూడా పొందుతారు.యూజర్లు సెట్టింగ్ ఆప్షన్‌కి వెళ్లడం ద్వారా తమకు నచ్చిన భాషను ఎంచుకోగలుగుతారు.

జీమెయిల్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఇలా వినియోగించుకోండి.టెక్స్ట్‌ను అనువదించడానికి మీ ఇమెయిల్ ఎగువన ఉన్న “ట్రాన్స్‌లేషన్” ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు ఇమెయిల్‌ను అసలు భాషలో చదవాలనుకుంటే ట్రాన్స్‌లేషన్ ఆప్షన్‌ను కూడా తీసివేయవచ్చు.నిర్దిష్ట భాష కోసం అనువాద బ్యానర్‌ను ఆఫ్ చేయడానికి, మీరు “డూ నాట్ ట్రాన్స్‌లేట్ ద లాంగ్వేజ్ ఎగైన్”పై నొక్కాలి.

సిస్టమ్ ఏదైనా ఇతర భాషను గుర్తించలేకపోతే, మీరు మూడు చుక్కలుగా కనిపించే బటన్‌పై నొక్కడం ద్వారా దానిని నేరుగా ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube