వారంలో 2 సార్లు ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు రక్తహీనత కూడా పరారవుతుంది!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాగే వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది రక్తహీనతకు బాధితులుగా ఉన్నారు.

 Best Smoothie For Losing Weight And Get Rid Of Anemia! Weight Loss, Weight Loss-TeluguStop.com

అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే ఓ అద్భుతమైన స్మూతీ ఉంది.వారంలో కేవ‌లం రెండు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదు రక్తహీనత సైతం పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Anemia, Tips, Latest, Smoothie-Telugu Health

ముందుగా బాగా పండిన ఒక పైనాపిల్( Pineapple ) ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు ఫ్రెష్ పాలకూర ( Spinach )ఆకులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ హోమ్ మేడ్ కొబ్బరి పాలు లేదా బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన పైనాపిల్ పాలకూర స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.

ఈ స్మూతీ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది.వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.

అలాగే ఈ పైనాపిల్ పాల‌కూర‌ స్మూతీలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

Telugu Anemia, Tips, Latest, Smoothie-Telugu Health

అందువల్ల ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత ( Anemia )పరార్ అవుతుంది.అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాల‌ను తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

మరియు జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube