సీతా రామం సినిమా( Sita Ram movie ) తర్వాత దుల్కర్ సల్మాన్ కి తెలుగులో యమ క్రేజ్ వచ్చింది.అతడు ఏ సినిమా తీసినా కూడా ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు.
అయితే సీతారామన్ మహానటి సినిమాలు అతడు తెలుగులో నేరుగా నటించిన చిత్రాలు కానీ అంతకన్నా ముందే ఎన్నో డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి తమిళ్లో మలయాళం లో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) నటించిన సినిమాలు ఎన్ని తెలుగులో దబ్ అయ్యాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దశాబ్ద కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ 2012లో సెకండ్ షో సినిమా( Second show movie ) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు.అయితే 2015 వరకు దుల్కర్ నటించిన ఈ సినిమా కూడా డబ్బింగ్ అయ్యి తెలుగులో విడుదల కాలేదు మొట్టమొదటిసారిగా విడుదలైన డబ్బింగ్ సినిమా ఓకే బంగారం.ఆ తర్వాత 2017 లో అందమైన జీవితం అనే సినిమా, 2018 లో జనతా హోటల్ , 2020 లో పరిణయం, కనులు కనులను దొచయంటే సినిమాలు డబ్ చేయబడ్డాయి.ఇక సీతా రామం తర్వాత దుల్కర్ డబ్బింగ్ సినిమాల హవా బాగా పెరిగింది.

2021 లో కురుప్ ( kurup )అనే ఓకే ఒక్క సినిమా రాగ 2022 లో ఏకంగా హే సినామిక, సెల్యూట్( Hey Sinamika, salute ) అనే రెండు సినిమాలు వచ్చాయి.ఇక ఈ కింగ్ ఆఫ్ కోత అనే మరో డబ్బింగ్ సినిమాతో తెలుగులోకి వచ్చాడు అయితే ఇది అనుకున్నంత విజయ సాధించలేదు.ఇలా దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని నేరుగా కొన్ని సినిమాల్లో నటిస్తూ డబ్బింగ్ చిత్రాలను కూడా వరుసగా విడుదల చేస్తుండడం విశేషం.ఇక తెలుగులో మాత్రమే కాదు దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలో నేరుగా నటిస్తూ అన్ని భాషల్లో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
కథ నచ్చితే చాలు భాష ఏది అనే విషయాన్ని దుల్కర్ పట్టించుకోవడం లేదు.