ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.మరికొందరైతే ఏకంగా వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ అమాయకపు ఆడ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఓ యువతి సెలవులు గడిపేందుకు తన చిన్నాన్న పిన్ని ల ఇంటికి వెళ్లగా వరసకు చిన్నాన్న అయినటువంటి వ్యక్తి చేతిలో దారుణంగా అత్యాచారానికి గురై గర్భవతి అయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విజయవాడ పట్టణ పరిసర ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతి సెలవులను గడిపేందుకు తనకి వరసకి చిన్నాన్న అయ్యేటువంటి ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళింది.
అయితే ఈ క్రమంలో యువతిపై ఆమె చిన్నాన్న కన్నేశాడు.దీంతో ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలని పలు పథకాలను పన్నాడు.ఇందులో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.అనంతరం ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే కుటుంబ పరువు పోతుందని ప్రాధేయపడడంతో యువతి కిక్కురు మనకుండా ఉండిపోయింది.
కాగా తాజాగా యువతి కడుపులో నొప్పి కారణంగా వైద్యుల దగ్గరికి వెళ్లడంతో యువతి గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు.ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగు తిన్నారు.
అయితే యువతి గర్భం దాల్చడానికి కారణాలను కనుగొని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశారు.అలాగే బంధువుల ఇంటికి పంపిస్తే తన కూతురిపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను యువతి తల్లిదండ్రులు కోరారు.