సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో చాలామంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా ( Security Guard ) పని చేసి ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అందుకున్న వాళ్లలో గిప్పీ గ్రేవాల్( Gippy Grewal ) ఒకరు.
పంజాబీ పాటల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న గిప్పీ గ్రేవాల్ ఒకప్పుడు ఫ్యాక్టరీలలో, హోటల్స్ లో పని చేశాడు.అయితే ఆ కష్టాలు అతనిని పూర్తిగా మార్చేశాయి.
బాల్యం నుంచి కష్టపడటం అలవాటు చేసుకున్న గిప్పీ గ్రేవాల్ ప్రస్తుతం కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటిస్తున్నారు.హీరోగా నటించడం కోసం ఆయన 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది.
జట్ నువు చుడైల్ తక్రి( Jatt Nuu Chudail Takri ) అనే హర్రర్ కామెడీ మూవీలో గిప్పీ గ్రేవాల్ నటించగా మార్చి నెల 15వ ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటానని గిప్పీ గ్రేవాల్ ఫీలవుతున్నారు.

పంజాబీ సినీ ఇండస్ట్రీలో( Punjab Cine Industry ) ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న సెలబ్రిటీలలో గిప్పీ గ్రేవాల్ ఒకరు.నటుడిగా, దర్శకుడిగా, సింగర్ గా ఇలా వేర్వేరు రంగాలలో సత్తా చాటుతూ గిప్పీ గ్రేవాల్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.2010 సంవత్సరంలో నటుడిగా గిప్పీ కెరీర్ మొదలైంది.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నటులలోన్ గిప్పీ ఒకరు కావడం గమనార్హం.

గిప్పీ గ్రేవాల్ చేసిన ఆల్బమ్స్ సైతం ఊహించని రేంజ్ లో హిట్ అయింది.నటనలో సత్తా చాటుతూ గిప్పీ గ్రేవాల్ సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.గిప్పీ గ్రేవాల్ ఇతర భాషల్లో సైతం గుర్తింపును సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.గిప్పీ గ్రేవాల్ కెరీర్ పరంగా ఎదిగిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.