కామారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ ధరకు బంగారం విక్రియిస్తామని కొందరు కేటుగాళ్లు ఓ బట్టల వ్యాపారికి టోకరా వేశారు.
సదాశివనగర్ లో వ్యాపారి వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు బంగారు హారం తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికారు.అనంతరం కిలో బంగారు హారం రూ.3 లక్షలంటూ బేరానికి దిగారు.వారి మాటలను నమ్మిన వ్యాపారి హారాన్ని తీసుకున్నారు.
అయితే పరీక్షల్లో అది నకిలీ బంగారంగా తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.