వట్టివేరు సాగు చేసే విధానం.. ఈ మెలకువలతో ఆదాయం లక్షల్లో..!

వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి వచ్చే పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తారు.అయితే ఏ పంట వేస్తారో ఆ పంటపై పూర్తి అవగాహన ఉంటేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

 Vattiveru Cultivation Method Income In Lakhs With This Awakening , Vattiveru , V-TeluguStop.com

వ్యవసాయంపై అవగాహన ఉన్న రైతులు చాలా మంది వరి, వేరుశనగ పంటలకు ప్రత్యామ్నాయంగా వట్టివేరు పంటను ( Vattiveru )సాగు చేసి అధిక లాభాలను గడిస్తున్నారు.

ఈ వట్టివేరును ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్ల మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

రైతులు పలు ఔషధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఈ పంటను సాగు చేస్తున్నారు.ఈ పంటలో అధిక దిగుబడి సాధించడం కోసం ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తే దాదాపుగా మూడు టన్నుల వరకు పంట దిగుబడి పొందవచ్చు.మార్కెట్లో ఒక టన్ను వట్టివేరు ధర సుమారుగా రూ.1లక్ష వరకు ఉంటుంది.ఒక ఎకరం లో పంట సాగు చేయడానికి సుమారుగా రూ.1లక్ష పెట్టుబడి అవుతుంది.ఈ పంట సాగు ద్వారా పెట్టుబడి తీసేస్తే సుమారుగా రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

Telugu Agriculture, Latest Telugu, Pest, Vattiveru-Latest News - Telugu

ఒక ఎకరం పొలంలో సుమారుగా 65 వేల వట్టివేరు మొక్కలు నాటుకోవాలి.మొదటిసారి ఈ పంటను సాగు చేస్తున్నప్పుడు మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి.తర్వాత పంట నుండి వచ్చిన విత్తనాలను తీసి మళ్లీ పొలంలో విత్తుకోవచ్చు.

ఈ వట్టివేరు నుంచి ఆయిల్ కూడా తీస్తారు.పంట సమయం 7 నెలలు.

వరి, వేరుశనగ పంటలకు ఏ మోతాదులో ఎరువులు వేస్తాము ఈ పంటకు కూడా అదే మోతాదులో ఎరువులు వేయాలి.

Telugu Agriculture, Latest Telugu, Pest, Vattiveru-Latest News - Telugu

ఈ పంటకు చీడపీడల బెడద( Pest infestation ) చాలా తక్కువ.ఇంతకు ముందు వేసిన పంట యొక్క అవశేషాలను పొలం నుండి పూర్తిగా తొలగించాలి.పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

శుభ్రమైన నీటినే పంటకు అందించాలి.ఈ పంట వేసిన మూడు నెలలకు మొక్క ఐదు అడుగుల ఎత్తు పెరుగుతుంది.

భూమిపై నుంచి ఒక అడుగు వదిలేసి మిగతా భాగాన్ని కత్తిరించాలి.ఈ పొలంలో ఎరువులు వేస్తే మొక్క ఐదు అడుగుల వరకు పెరుగుతుంది.

తరువాత పంట కోతలు చేపట్టే సమయంలో మళ్లీ ఒక అడుగు వదిలేసి పంట కోతలు చేయాలి.తరువాత హార్వెస్టింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు పొలంలో మిగిలిన మొదలు భాగాన్ని విత్తనంగా వాడుకోవచ్చు.పంట కోత తరువాత వేర్లను విక్రయించి అధిక లాభాలు పొందవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube