ఇంట్లో మీరు గీజర్ వాడితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోవాలి సుమా!

మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనుషుల సౌకర్యార్ధం కావచ్చు….గీజర్ వాడకం అనేది రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

 Geyser Water Heater Safety Tips And Tricks,geyser,water Heater, Geyser Safety Ti-TeluguStop.com

ముఖ్యంగా నేడు ఎక్కడ చూసినా పాత ఇండ్ల నిర్మాణం స్థానంలో కొత్త కొత్త ఇల్లు దర్శనం ఇస్తున్నాయి.దాంతో వాష్ రూములలలో గీజర్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా స్నానానికి వేడి నీరు అవసరం ఎక్కువగా ఏర్పడడంతో గీజర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.అయితే.

గీజర్ల కారణంగా ఇటీవల ప్రమాదాలు జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు.

Telugu Geyser, Geyser Safety, Heater-Latest News - Telugu

వీటి కారణంగా కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా వుంది.గీజర్ వాడకంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా చాలామంది చాలా సార్లు గీజర్‌ని ఆన్ చేసి.

ఆఫ్ చేయడం మర్చిపోతూ వుంటారు.ఇది చాలా తప్పు.

గీజర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంటే.పేలే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి గీజర్ ఆన్ చేసిన సమయంలోనే ఎప్పుడు ఆఫ్ చేయాలన్నది గుర్తుంచుకోవాలి.అవసరం అయితే.

అలారం పెట్టుకొని మరీ ఆఫ్ చేయాలి.

Telugu Geyser, Geyser Safety, Heater-Latest News - Telugu

ముఖ్యంగా గీజర్ పాత మోడల్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి.ఇంకా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి.టెక్నీషియన్ తోనే ఫిట్టింగ్ చేయించడం ఉత్తమం.

ఏదైనా కనెక్షన్ ఇవ్వడంలో తప్పు చేస్తే.షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.

ఏమైనా చిన్న చిన్న రిపేర్ వచ్చినా సొంత నాలెడ్జ్ వాడకుండా టెక్నీషియన్ తోనే చేయించడం చాలా ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి.బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌.

గీజర్ లో బ్యూటేన్ మరియు ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి.ఇవి కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి.

అందుకే బాత్‌రూమ్‌లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా అమర్చడం మర్చిపోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube