ఎన్టీఆర్ ని అలా, అక్కినేని ని ఇలా శ్రీదేవి ఎందుకు పిలిచేది ..?

శ్రీదేవి… అతి లోక సుందరి గా తెలుగు వారికి అమే ఒక ఆరాధ్య దేవత.చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారి తన కన్న సీనియర్స్ తో మరియు జూనియర్స్ తో నటించిన అనుభవం ఆమెకు సొంతం.

 Why Sridevi Calls Nandamuri Taraka Rama Rao And Akkineni Nageswara Rao Like That-TeluguStop.com

శ్రీదేవి తెలుగు లో మొదట సీనియర్ ఎన్టీఆర్ తో బడి పంతులు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఆ తర్వాత అమే హీరోయిన్ గా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.

బొబ్బిలి పులి సినిమా కి వచ్చే సరికి అన్నగారు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించే పరిస్థితి వచ్చింది.

అయినా కూడా శ్రీదేవి కి ఎలాంటి భయం లేకపోయినా, అంతకు ముందు కూతురు గా నటించిన అమ్మాయితో రోమాన్స్ చేయడానికి అన్నగారి కంటే అమే ఎక్కువ ఇబ్బంది పడిందట.

ఎన్టీఆర్ తో నటించాలనే బలవంతం ఆమెను ఎవరు చేయలేదు కానీ ఎంతైనా వీరి మధ్య వయసు భేదం చాలా ఉండటం వల్లే ఈ ఫీలింగ్ వచ్చింది.అయితే ఈ సినిమాలో శ్రీదేవి నటించడానికి ముఖ్య కారణం మాత్రం దాసరి నారాయణరావు గారు.

Telugu Badipanthulu, Dasari Yana Rao, Sridevi, Nandamuritaraka, Tollywood, Uncle

ఆమెను ఒప్పించింది ఆయనే.మొదట్లో అమే ఇబ్బంది పడ్డా కూడా నేను అంత చూసుకుంటాను అని చెప్పి ఒప్పించారట.ఇక బడి పంతులు సినిమా టైం నుంచి ఎన్టీఆర్ నీ అంకుల్ అని పిలిచే అలవాటు ఉన్న శ్రీదేవి హీరోయిన్ గా నటించిన కూడా అలాగే పిలిచేదట.అందుకు ఎన్టీఆర్ కూడా కాస్త సరదాగా తీసుకునేవారు.

పైగా బొబ్బిలి పులి సినిమా టైం లో శ్రీదేవి వయసు 22 అయితే పెద్దాయన వయసు 50 కి పైగా ఆందేది.

Telugu Badipanthulu, Dasari Yana Rao, Sridevi, Nandamuritaraka, Tollywood, Uncle

ఆకారంలో కూడా ఆయన కాస్త పెద్దగా కనిపించేవారు.ఇక అదే టైం లో అక్కినేని తో కూడా శ్రీదేవి నటించడం మొదలు పెట్టింది.అక్కినేని నీ మాత్రం అమే సర్ అని సంబోధించడం చేసేదట.

అందుకు కారణం అక్కినేని ఎప్పుడు డైట్ చేస్తూ చూడటానికి చిన్నగా కనిపించే వారు.పైగా శ్రీదేవి తో అక్కినేని అంతా చనువుగా ఉండేవారు కాదు.

అందుకే అమే ఎప్పుడు అక్కినేని తో కాస్త దూరం దూరం అన్నట్టు ఉంటూ ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube