ఎన్టీఆర్ ని అలా, అక్కినేని ని ఇలా శ్రీదేవి ఎందుకు పిలిచేది ..?

శ్రీదేవి.అతి లోక సుందరి గా తెలుగు వారికి అమే ఒక ఆరాధ్య దేవత.

చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారి తన కన్న సీనియర్స్ తో మరియు జూనియర్స్ తో నటించిన అనుభవం ఆమెకు సొంతం.

శ్రీదేవి తెలుగు లో మొదట సీనియర్ ఎన్టీఆర్ తో బడి పంతులు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఆ తర్వాత అమే హీరోయిన్ గా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.బొబ్బిలి పులి సినిమా కి వచ్చే సరికి అన్నగారు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించే పరిస్థితి వచ్చింది.

అయినా కూడా శ్రీదేవి కి ఎలాంటి భయం లేకపోయినా, అంతకు ముందు కూతురు గా నటించిన అమ్మాయితో రోమాన్స్ చేయడానికి అన్నగారి కంటే అమే ఎక్కువ ఇబ్బంది పడిందట.

ఎన్టీఆర్ తో నటించాలనే బలవంతం ఆమెను ఎవరు చేయలేదు కానీ ఎంతైనా వీరి మధ్య వయసు భేదం చాలా ఉండటం వల్లే ఈ ఫీలింగ్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో శ్రీదేవి నటించడానికి ముఖ్య కారణం మాత్రం దాసరి నారాయణరావు గారు.

"""/" / ఆమెను ఒప్పించింది ఆయనే.మొదట్లో అమే ఇబ్బంది పడ్డా కూడా నేను అంత చూసుకుంటాను అని చెప్పి ఒప్పించారట.

ఇక బడి పంతులు సినిమా టైం నుంచి ఎన్టీఆర్ నీ అంకుల్ అని పిలిచే అలవాటు ఉన్న శ్రీదేవి హీరోయిన్ గా నటించిన కూడా అలాగే పిలిచేదట.

అందుకు ఎన్టీఆర్ కూడా కాస్త సరదాగా తీసుకునేవారు.పైగా బొబ్బిలి పులి సినిమా టైం లో శ్రీదేవి వయసు 22 అయితే పెద్దాయన వయసు 50 కి పైగా ఆందేది.

"""/" / ఆకారంలో కూడా ఆయన కాస్త పెద్దగా కనిపించేవారు.ఇక అదే టైం లో అక్కినేని తో కూడా శ్రీదేవి నటించడం మొదలు పెట్టింది.

అక్కినేని నీ మాత్రం అమే సర్ అని సంబోధించడం చేసేదట.అందుకు కారణం అక్కినేని ఎప్పుడు డైట్ చేస్తూ చూడటానికి చిన్నగా కనిపించే వారు.

పైగా శ్రీదేవి తో అక్కినేని అంతా చనువుగా ఉండేవారు కాదు.అందుకే అమే ఎప్పుడు అక్కినేని తో కాస్త దూరం దూరం అన్నట్టు ఉంటూ ఉండేది.

ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..